
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ (2021 ప్రవేశ పరీక్ష)ను ఈ నెల 21వ తేదీ ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య కె.విశ్వేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందన్నారు.
చదవండి: Sri Lanka: మీ వ్యవసాయ ఉత్పత్తులు కావాలి
పరీక్ష సమయానికి గంట ముందు నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలతో అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్)లు పంపిస్తామని చెప్పారు. అభ్యర్థులు www.sche.ap.gov.in/edcet వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment