edcet exam
-
టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు. ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడండి. -
ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయ విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎడ్‌సెట్ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పేర్కొంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ -
AP: 21న ఎడ్‌సెట్
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ (2021 ప్రవేశ పరీక్ష)ను ఈ నెల 21వ తేదీ ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య కె.విశ్వేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందన్నారు. చదవండి: Sri Lanka: మీ వ్యవసాయ ఉత్పత్తులు కావాలి పరీక్ష సమయానికి గంట ముందు నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలతో అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్)లు పంపిస్తామని చెప్పారు. అభ్యర్థులు www.sche.ap.gov.in/edcet వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు. -
ఎడ్‌సెట్‌కు 83 శాతం హాజరు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎడ్‌సెట్-2015 ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రవేశ పరీక్షకు 83.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ పరీక్షను 21,286 మంది రాశారు. రాష్ట్రంలోని 31 పట్టణాల్లో 59 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 25,539 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 4,253 మంది గైర్హాజరయ్యారు. మ్యాథమేటిక్స్‌కు 6,247 మంది దరఖాస్తు చేయగా 5,021 మంది హాజరయ్యారు. ఫిజికల్ సైన్స్‌కు 2,532గాను 2,094 మంది, బయాలజీ సైన్స్‌కు 5,086గాను 4,237 మంది, సోషల్ స్టడీస్‌కు 11,062గాను 9,420 మంది హాజరయ్యారు. ఇంగ్లిషుకు 612 మంది దరఖాస్తు చేస్తే 514 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల తనిఖీ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లోని పరీక్ష కేంద్రాలను ఎడ్‌సెట్ చైర్మన్, ఎస్వీయూ వీసీ డబ్ల్యు రాజేంద్ర, కన్వీనర్ కుమారస్వామి, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, రీజినల్ కోఆర్డినేటర్ చెండ్రాయుడు, సిటీ కోఆర్డినేటర్ ఎం.సుబ్రమణ్యం తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణను పరిశీలించారు. 12న ఫలితాలు: ఎడ్‌సెట్-2015 ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ టీ కుమారస్వామి తెలిపారు.