ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
Published Tue, Oct 1 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: రాయలసీమ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఆదివారం వాయిదా వేసిన అభ్యర్థులతో కలిపి అన్ని ర్యాంకర్ల వారికి సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. గణిత శాస్త్ర అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి అర్హులైన వారికి స్క్రాచ్ కార్డులు అందించారు. మొత్తం 222 మంది అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేసుకున్నారు.
వర్సిటీలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ సెంటర్‌ను వీసీ ఆచార్య కె. కృష్ణనాయక్, ఇంఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్ పరిశీలించారు. మంగళవారం ఫిజికల్ సైన్స్, ఇంగ్లీషు సబ్జెకుల వారికి కౌన్సెలింగ్ ఉంటుందని సెంటర్ కోఆర్డినేటర్ ఆచార్య సంజీవరావు తెలిపారు. ఆర్‌యూలోని కౌన్సెలింగ్ సెంటర్‌కు ఒకటి నుంచి 1500 ర్యాంకుల వారు, 4001 నుంచి 6500 వరకు ర్యాంకుల వారు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన మరో వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో 1501 నుంచి 4001 ర్యాంకుల వారు, 6500 నుంచి ఆపైన ర్యాంకులవారు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.
Advertisement
Advertisement