31 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
హైదరాబాద్: టీఎస్ ఎడ్‌సెట్-2015కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓయూ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 64231 దరఖాస్తులు అందిన్నట్లు వివరించారు. అందులో మ్యాథ్స్‌కు 1345, ఫిజికల్‌సైన్స్‌కు 4364, బయోలాజికల్‌సైన్స్‌కు 15498, సోషల్‌సైన్స్‌కు 30436, ఇంగ్లిష్‌కు 844 దరఖాస్తులు అందినట్లు చెప్పారు.
1347 మంది ఉర్దూ అభ్యర్థులకు హైదరాబాద్‌లో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ 6న జరిగే ఈ పరీక్షకు ఈ నెల 31 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరన్నారు.
ఎడ్‌సెట్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Sat, May 23 2015 5:57 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
Advertisement
Advertisement