
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఇప్పటి వరకు 5,678 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్మీడియెట్ రీ వెరిఫికేషన్‌కు 73,984 దరఖాస్తులు
ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీలకు మొత్తంగా 73,984 మంది వి ద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రీకౌంటింగ్ కోసం 14,333 మంది, రీ వెరిఫికేషకన్ ఫొటో కాపీ కోసం 59,651 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. వెరిఫికేషన్‌కు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది.