TSPECET
-
అక్టోబర్‌లో పీజీఈసెట్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 21నుండి 24 వరకు జరిగిన టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు టీఎస్‌పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మ్-డి (పోస్ట్)లో రెగ్యులర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్పీజీసెట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే అభ్యర్థులు 28 సెప్టెంబర్ 2020 ప్రాథమిక కీతో మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే 28 సెప్టెంబర్ 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 వరకు http://pgecet.tsche.ac.in/ అభ్యర్థులు వెబ్సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఫలితాలు http://pgecet.tsche.ac.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కుమార్ మొలుగారం పేర్కొన్నారు. -
పీఈసెట్ దరఖాస్తులకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఇప్పటి వరకు 5,678 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ రీ వెరిఫికేషన్‌కు 73,984 దరఖాస్తులు ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీలకు మొత్తంగా 73,984 మంది వి ద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రీకౌంటింగ్ కోసం 14,333 మంది, రీ వెరిఫికేషకన్ ఫొటో కాపీ కోసం 59,651 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. వెరిఫికేషన్‌కు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. -
టీఎస్‌పీఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యాయామ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన టీఎస్‌పీఈసెట్–2017 ఫలితాలు విడుదలయ్యాయి. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. బీపీఈడీ, డీపీఈడీ కేటగిరీలో మొత్తం 5,653 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 5,502 (97.99%) మంది ఉత్తీర్ణులయ్యారు. బీపీఈడీ కేటగిరీలో 2,865 మందికి 2776 (97.65%) మంది, డీపీఈడీ కేటగిరీలో 2,788 మందికి 2,726 (98.37%)మంది ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీలో తొలి ర్యాంకు రాళ్ల నవత (వనపర్తి), రెండో ర్యాంకు అశ్విని (వరంగల్), మూడో ర్యాంకు శ్రీను (చర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) సాధించారు. డీపీఈడీలో కేటగిరీలో తొలి ర్యాంకు రజిత (జయశంకర్ భూపా లపల్లి జిల్లా), రెండో ర్యాంకు సంధ్య (నల్లగొండ), మూడో ర్యాంకు అనూష (ఆత్మకూరు, వనపర్తి జిల్లా) సాధించారు.