సాక్షి, న్యూఢిల్లీ : గుట్కా, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ ఉత్పత్తులపై నిషేధాన్ని పొడిగిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎల్‌ఆర్ గార్గ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
ప్రజారోగ్య ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని గుట్కా, పాన్ మసాలాతో సహా పొగాకు ఉత్పత్తులన్నింటిపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే సిగరెట్లపై అలాంటి నిషేధం విధించే ఉద్దేశం లేదని అధికార వర్గాలు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment