సంగక్కర పదవీకాలం పొడిగింపు | Sangakkara tenure as MCC president extended to September 2021 | Sakshi
Sakshi News home page

సంగక్కర పదవీకాలం పొడిగింపు

Published Thu, May 7 2020 5:11 AM | Last Updated on Thu, May 7 2020 5:11 AM

Sangakkara tenure as MCC president extended to September 2021 - Sakshi

కుమార సంగక్కర

లండన్‌: ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్‌ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది’ అని క్లబ్‌ పేర్కొంది. గతేడాది అక్టోబర్‌ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్‌... ఈ పీఠాన్ని అధిష్టించిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా ఘనత సాధించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement