హరియాణాలో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పాయి. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లుండగా ‘ఈసారి 75కు పైగా సీట్లు మనవే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలు కూడా సాధించలేకపోయింది. సీఎం ఖట్టర్ కేబినెట్‌లోని మెజారిటీ మంత్రులు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటీగా మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఫలితాల సరళిని బట్టి కొత్తగా అవతరించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది.