హరియాణాలో కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహం.. | Haryana Assembly Polls 2019: Independents Emerges As Key Members | Sakshi
Sakshi News home page

హరియాణాలో కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహం..

Published Thu, Oct 24 2019 10:39 AM | Last Updated on Thu, Oct 24 2019 10:39 AM

Haryana Assembly Polls 2019: Independents Emerges As Key Members - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో హంగ్‌ దిశగా ఫలితాల సరళి సాగుతుండటంతో ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల సంఖ్య 46 కాగా మేజిక్‌ మార్క్‌కు చేరువగా బీజేపీ నిలిచిపోవడంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు చిన్న పార్టీ జేజేపీని తనవైపు తిప్పకుని ఆ పార్టీకి సీఎం పదవి ఆఫర్‌ చేయడం ద్వారా బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఇక మేజిక్‌ ఫిగర్‌కు ఒకట్రెండు స్ధానాలే తగ్గడంతో చిన్న పార్టీల్లో రెబెల్స్‌ను బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తంమీద హరియాణాలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి అనుకూల పరిస్థితి ఉందనేది వెల్లడవనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement