ఓడితే మీసం తీసేసి, గుండు కొట్టించుకుంటా’ | BJP Minister Gajendra Singh Khimsar Sensational Announcement | Sakshi
Sakshi News home page

ఓడితే మీసం తీసేసి, గుండు కొట్టించుకుంటా’

Published Tue, Nov 12 2024 12:49 PM | Last Updated on Tue, Nov 12 2024 12:49 PM

BJP Minister Gajendra Singh Khimsar Sensational Announcement

జైపూర్‌: మహారాష్ట్ర-జార్ఖండ్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే కోవలో రాజస్థాన్‌లోని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు విరివిగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజస్థాన్‌ బీజేపీ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్‌సర్ సంచలన ప్రకటన చేశారు.

ఈ ఎ‍న్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ ఓటమిపాలు కాదని, ఒకవేళ ఓడిపోతే తాను మీసాలు తీసేసి, గుండు కొట్టించుకుంటానని అన్నారు. ఖిన్వ్‌సర్‌లోని సదర్ బజార్ చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన  ఈ ప్రకటన చేశారు. తాను ఖిన్వసర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనకు 95 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు.

ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధి కోసం దోహదపడతాయన్నారు. తాను తొలిసారి ఎన్నికల్లో గెలిచి నప్పుడు తనను నాటి సీఎం వసుంధర రాజే మంత్రిని చేశారన్నారు. ఈ ప్రాంతాన్ని  ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఈ ఎన్నికల సభలో బీజేపీ అభ్యర్థి రేవంత్రం దంగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతి మిర్ధా పాల్గొన్నారు. రాష్ట్రంలోని  ఖిన్వ్‌సర్, డియోలీ-ఉనియారా, దౌసా, జుంఝును, రామ్‌గఢ్, సాలంబెర్ చౌరాసి అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13న పోలింగ్‌ జరగనుంది. 

ఇది కూడా చదవండి: Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్‌ ఓటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement