ముంబయి: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వం మహిళల కోసం ప్రకటిస్తున్న స్కీమ్‌లపై శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. ఈ స్కీమ్‌లన్నీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూలకు పడేసే స్కీమ్‌లని ఎద్దేవా చేశారు. ఆదివారం(జులై 7) ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ‘అత్యవసరంగా చాలా స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేసే రాజకీయ స్టంట్ మాత్రమే. స్కీమ్‌లు రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినా..రాకపోయినా ఈ స్కీమ్‌లను అమలు చేయరు’అని థాక్రే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment