సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 81 అసెంబ్లీ స్ధానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నవంబర్ 30న తొలి దశ పోలింగ్, డిసెంబర్ 7న రెండో దశ, డిసెంబర్ 12న మూడో దశ, డిసెంబర్ 16న నాలుగో దశ, డిసెంబర్ 20న అయిదో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక వచ్చేఏడాది జనవరి 5తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సీఈసీ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కాగా, 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జార్ఖండ్‌లో ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment