జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ కారణంగా పొలిటికల్‌గా సీఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆయన సీఎం పదవికే గండం ఏర్పడింది. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్‌పై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది.
వివరాల ప్రకారం.. జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. దీనిపై గవర్నర్ రమేష్ బైస్కు.. ఈసీ అభిప్రాయం కోరారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్టు సమాచారం. కాగా, ఈసీ నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్‌పై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది.
#Jharkhand CM #HemantSoren's Assembly membership cancelled, Governor to pronounce opinion shortly #miningleasecasehttps://t.co/PFbUd9KtAc
— India TV (@indiatvnews) August 25, 2022
Comments
Please login to add a commentAdd a comment