
గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు
రాంఛీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్‌కు సంబంధాలున్నట్లు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్‌కు సూచించింది.ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.
చదవండి: ఆజాద్ డీఎన్‌ఏ 'మోడీ-ఫై' అయింది: జైరాం రమేశ్