న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకునేలా పథకాలు రూపొందించామని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఘన విజయం సాధిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌పైనే దృష్టి పెట్టాయని, బీజేపీ డబుల్ ఇంజిన్ గ్రోత్‌తో ముందుకెళ్తోందన్నారు. ఇక లఖీంపూర్ ఘటనపై స్పందించిన మోదీ.. యూపీ ప్రభుత్వం విచారణకు సహకరిస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు
చదవండి: Hijab Row: ముస్లిం విద్యార్థులకు ప్రియాంక మద్దతు.. బికినీ, జీన్స్, హిజాబ్ ఏదైనా అంటూ..
‘బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తాం. పాత సిద్ధాంతాలను యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే మా నినాదం.’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
చదవండి: మేఘాలయలో కాంగ్రెస్ కల్లాస్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు..
Comments
Please login to add a commentAdd a comment