HARYANA ASSEMBLY ELECTION POLLING UPDATES...
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మరికాసేపట్లో హర్యానాలో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నం మూడు గంటల వరకు 49.1 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పలుచోట్లు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్‌లో ఉన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.7% పోలింగ్ నమోదైంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, అధికార బీజేపీ హ్యాట్రిక్‌పై కన్నేసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ సైతం తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి.
అనేక స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం ఉంది.
ఉదయం నుంచీ సీఎం నాయబ్ సైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలువురు వీఐపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే స్టార్ క్రీడాకారులు మనూ బాకర్, వినేష్ ఫోగట్ కూడా ఓటేసిన వారిలో ఉన్నారు.
ఇవాళ జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో నాయబ్ సైనీ, భూపీందర్ హుడా, వినేష్ ఫోగట్ సహా దాదాపు వెయ్యి మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది.
హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 20వేల623 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.
పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ఝజ్జర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది.ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.హరియాణా సీఎం, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ విశ్వాసం వ్యక్తంచేశారు.
ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ డిప్యూటీసీఎం దుశ్యంత్ చౌతాాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్‌లో ఓటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment