
టిడిపి రెబల్ అభ్యర్థుల సస్పెన్షన్
హైదరాబాద్: టిడిపి తిరుగుబాటు అభ్యర్థులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ కోసం శ్రమిస్తున్న కొందరు తమకు టికెట్ వస్తుందని ఆశించారు. అటువంటి వారు టికెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి-బిజెపి పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన స్థానాలలో కూడా కొందరు నామినేషన్లు వేశారు. అటువంటి తిరుగుబాటు అభ్యర్థులు ఎనిమిది మందిని టిడిపి సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన రెబెల్ అభ్యర్థులు - వారు నామినేషన్ వేసిన స్థానాలు
1.శర్మ - పిఠాపురం
2.కొట్టు సత్యనారాయణ - తాడేపల్లిగూడెం
3.టీవీ రామారావు - కొవ్వూరు
4.దుర్గాప్రసాద్ - కడప
5.జితేందర్ - గుంతకల్లు
6. జయరాజ్ - కురుపాం
7.కుంభా రవిబాబు - అరకు
8.అనిత - భీమిలి
వీరిలో పార్టీ బిఫారాలు ఇచ్చినవారు కూడా ఉన్నారు. పార్టీ బిఫారమ్ ఇచ్చి ఇప్పుడు సస్పెండ్ చేయడమేమిటని పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ అంతా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాగా కొందరు భావిస్తున్నారు.