అభ్యర్థుల ఎంపికలోనే సత్తా చూపిన పార్టీ! | Educated candidates of YSRCP | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఎంపికలోనే సత్తా చూపిన పార్టీ!

Published Sun, Apr 20 2014 4:10 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అభ్యర్థుల ఎంపికలోనే సత్తా చూపిన పార్టీ! - Sakshi

అభ్యర్థుల ఎంపికలోనే సత్తా చూపిన పార్టీ!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఉన్నత విద్యావంతులకు పెద్దపీట వేసింది. చదువులలో తమ ప్రతిభ కనబరిచిన పలువురు రాజకీయాలలో కూడా తమ సత్తా చాటడానికి ముందుకు దూసుకువస్తున్నారు. అటువంటివారికి ఈ పార్టీ అవకాశం కల్పించింది. ఈ పార్టీ ఎంపిక చేసిన లోక్సభ, శాసనసభ అభ్యర్థులలో ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలు చేసినవారితోపాటు డాక్లర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు ఉన్నారు. కొంతమంది కార్పోరేట్ కొలువులు కాదని, మరి కొంత మంది వైట్ కాలర్ ఉద్యోగాలు వదులుకొని ప్రజాసేవ పట్ల ఆసక్తి కనబరిచారు. అటువంటి వారిని వైఎస్ఆర్ సిపి అభ్యర్థులుగా ఎంపిక చేసింది.

ఈ పార్టీ విశాఖ జిల్లా అరకు లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గ్రూప్‌ వన్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ  ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం లోక్సభ అభ్యర్ధిగా  పోటీ చేస్తున్న రెడ్డి శాంతి కూడా ఉన్నత విద్యావంతురాలు. ఆమె  భర్త ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా పనిచేస్తున్నారు.  నెల్లిమర్ల నుంచి పోటీచేస్తున్న సురేష్‌ వృత్తి రీత్యా డాక్టర్‌. అమలాపురం నుంచి పోటీ చేస్తున్న పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గతంలో జిల్లా పరిషత్ సిఇఓగా  పనిచేశారు. అనపర్తి నుంచి పోటీ చేస్తున్న సూర్యనారాయణరెడ్డి,   గన్నవరం నుంచి పోటీ చేస్తున్న దుట్టా రామచంద్రరావు, నరసరావుపేట నుంచి పోటీచేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నుంచి పోటీలో ఉన్న నన్నపనేని సుధ, మదనపల్లి బరిలో ఉన్న పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పూతలపట్టు నుంచి పోటీ చేస్తున్న సునీల్‌ డాక్టర్లే.

ఏలూరు లోక్సభ  అభ్యర్ధి తోట చంద్రశేఖర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి.  తిరుపతి అభ్యర్ధి వరప్రసాదరావు, కుప్పం  అభ్యర్ధి చంద్రమౌళిలు కూడా  మాజీ ఐఏఎస్‌ అధికారులే. పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న విద్యాసాగర్‌ డాక్టరేట్‌ పట్టా పొందారు. ప్రత్తిపాడు బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుచరిత కూడా ఉన్నత విద్యావంతురాలే.  ఆమె భర్త ఐఆర్‌ఎస్‌ అధికారి. పామర్రు నుంచి పోటీ చేస్తున్న ఉప్పులేటి కల్పన కూడా ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి సతీమణే. చిత్తూరు లోక్సభ అభ్యర్ధి సామాన్య కిరణ్‌ డాక్టరేట్‌ పట్టా పొందారు. ఆమె భర్త  ఐఏఎస్‌ అధికారి.  చంద్రగిరి నుంచి బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  డాక్టరేట్‌ పట్టా పొందిన వ్యక్తే. వీరేకాకుండా పలువురు న్యాయవాదులు, ఉన్నత విద్యావంతులు కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు అనేకమంది పారిశ్రామికవేత్తలు కూడా ఎన్నికల రేసులో ఉన్నారు.

 తెలంగాణ విషయాని కొస్తే మాజీ పోలీస్‌బాస్‌ దినేష్‌రెడ్డి మల్కాజ్‌గిరి లోక్సభ స్థానంబరిలో ఉన్నారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిగా డాక్టర్‌ కటికనేని నగేష్‌, మహబూబాబాద్‌ లోక్సభ అభ్యర్ధిగా డాక్టర్‌ తెల్లం వెంకట్రావు పోటీలో ఉన్నారు. సత్తుపల్లి నుంచి డాక్టర్‌ మట్టా దయానంద్‌  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హుజూర్‌నగర్‌ రేసులో ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి డాక్టరేట్‌ పట్టా పొందిన వ్యక్తే. వీరితొ పాటు అనేకమంది ఎంబీఏ, ఎంసీఏ చదివి విదేశాల్లో ఉద్యోగాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినవారు కూడా ఉన్నారు. ఉన్నత అధికారులుగా వ్యవహరించినవారు, విద్యావంతులు, యువకులు రాజకీయాలలోకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.

వైఎస్ఆర్ సిపి తరపున పోటీలో ఉన్న విద్యావంతుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.

అభ్యర్థి పేరు  - పోటీ చేసే స్థానం  - వారు నిర్వహించిన అధికార హోదా/ విద్యార్హతలు

కొత్తపల్లి గీత              - అరకు                - గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌
రెడ్డి శాంతి               - శ్రీకాకుళం                 - ఐఎఫ్‌ఎస్‌ అధికారి సతీమణి
సురేష్‌                     - నెల్లిమర్ల                   - డాక్టర్‌
గొల్ల బాబూరావు           - అమలాపురం     - మాజీ జెడ్పీ సీఈవో
సూర్యనారాయణరెడ్డి       - అనపర్తి                   - డాక్టర్‌
దేవీ ప్రియ మద్దాల        - చింతలపూడి        - డాక్టర్‌
దుట్టా రామచంద్రరావు      - గన్నవరం     - డాక్టర్‌
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి        - నరసరావుపేట     - డాక్టర్‌
నన్నపనేని సుధ           - వినుకొండ                - డాక్టర్‌
దేశాయ్‌ తిప్పారెడ్డి           - మదనపల్లి               - డాక్టర్‌
సునీల్‌                               - పూతలపట్టు     - డాక్టర్‌
తోట చంద్రశేఖర్‌            - ఏలూరు                - మాజీ ఐఏఎస్‌
వరప్రసాద్‌రావు             - తిరుపతి                    - మాజీ ఐఏఎస్‌
చంద్రమౌళి                       - కుప్పం                  - మాజీ ఐఏఎస్‌
కుక్కల విద్యాసాగర్‌        - పెనమలూరు              - డాక్టరేట్‌
మేకతోటి సుచరిత          - పత్తిపాడు              - ఐఆర్‌ఎస్‌ అధికారి సతీమణి
ఉప్పులేటి కల్పన           - పామర్రు                 - ఐఆర్‌ఎస్‌ అధికారి సతీమణి
సామాన్య కిరణ్‌           - చిత్తూరు                 - డాక్టరేట్‌ - ఐఏఎస్‌ అధికారి సతీమణి
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి         - చంద్రగిరి                - డాక్టరేట్‌
వి.దినేష్‌రెడ్డి                  - మల్కాజ్‌గిరి              - మాజీ ఐపీఎస్‌
కటికనేని నగేష్‌            - కరీంనగర్‌                 - డాక్టర్‌
తెల్లం వెంకట్రావు          - మహబూబాబాద్‌     - డాక్టర్‌
మట్టా దయానంద్‌        - సత్తుపల్లి              - డాక్టర్‌
గట్టు శ్రీకాంత్‌రెడ్డి          - హుజూర్‌నగర్‌         - డాక్టరేట్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement