utterakhand
-
మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ని ఒక ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా అకస్మాత్తుగా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చి మాజీ సీఎం వాహనాన్ని అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి కారు దిగి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా కోత్ద్వార్కి వస్తుండగా చోటుచేసుకుంది. తొలుత మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు వస్తుండటంతో మంత్రితో సహా ఆయన తోపాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పక్కనే ఉన్న కొండల వద్దకు పరుగులు తీశారు. పాపం సీఎం చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచుకున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. శివాలిక్ ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతం కొట్ద్వార్-దుగడ్డ మధ్య ఉండడంతో హైవేపై ఏనుగులు తరచూ వస్తుంటాయని దుగడ్డ రేంజ్ ఆఫీసర్ ప్రదీప్ డోబ్రియాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అక్కడ సర్వసాధరణమేనని చెప్పారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్) -
విద్వేష ప్రసంగాలు వద్దు: సుప్రీం హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో బుధవారం ధర్మ సంసద్ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గత ఏడాది హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష ప్రసంగాలు చేయడంతో ఈసారి అలా జరగకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఉత్తరాఖండ్‌లో బీజేపీ సర్కార్ సుప్రీంకు హామీ ఇచ్చింది. -
జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధం!
Election Rallies Ban Extended Till Jan 31: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్ కమీషన్(ఈసీ) పేర్కొంది. ఈ మేరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాదు దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా శనివారం రోడ్‌షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ముఖ్య ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలను మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు ఆ నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజకీయ పార్టీల భౌతిక బహిరంగ సభలకు లేదా పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం ఫిబ్రవరి 1 నుంచి సడలింపులను అనుమతించింది. పైగా కోవిడ్-19 ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాలలో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియోవ్యాన్‌లను మినహాయించి, ఇంటింటికీ ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల పరిమితిని 10కి పెంచినట్లు తెలిపింది. (చదవండి: బలమైన స్థానం నుంచే పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్!) -
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రడూన్ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని గ్రహించి వంతెనపైకి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. చదవండి: Cricketer Rashid Khan: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం -
ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్‌సింగ్ ధామి ప్రమాణస్వీకారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్పాల్ మహరాజ్, హరాక్సింగ్ రావత్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధామీతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో బిషన్‌సింగ్ చుపాల్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, గణేష్ జోషి, ధన్సింగ్ రావత్, రేఖా ఆర్య, యతీశ్వర్ ఆనంద్ ఉన్నారు. నూతన సీఎం పుష్కర్‌సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా తీరత్ సింగ్ రావత్‌కు కాలం కలిసిరాలేదు. ఓవైపు కరోనా.. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపించడంతో ఆయనకు పదవీ గండం తప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీ అంతర్గత కారణాలు కూడా బీజేపీ అధిష్టానం ఆయనను తప్పించడానికి దోహదం చేశాయని తెలుస్తోంది. -
బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు, కేసు నమోదు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బేగంపురా గ్రామానికి చెందిన పార్టీ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై ఐపీసీ సెక్షన్ 376, 504,506, సీఆర్పీసీ యాక్ట్ 156 (3)ల కింద కేసు నమోదు చేసినట్టు హరిద్వార్ సీనియర్ పోలీసు అధికారి అబుదాజ్ కృష్ణరాజ్ చెప్పారు. కొన్ని నెలల క్రితం సురేష్ రాథోడ్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం గురించి బయటపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్టు ఆరోపించింది. జ్వాలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ రాథోడ్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అంతేకాకుండా తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంటూ పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఆయన మీడియాతో మాట్లాడూతూ.. నా జీవితం ప్రమాదంలో ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను. కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో కేసు కూడా నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు బయట పెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇంతకు ముందు కూడా ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ నేగి పై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. -
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్‌సింగ్ ధామి గవర్నర్ బేబీరాణి మౌర్యను కలిశారు. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సీఎం ఎంపిక అనివార్యమైంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పుష్కర్‌సింగ్ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. పోటీలో మరో ఇద్దరు.. పుష్కర్‌కే ఓటు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు తీరత్ సింగ్ రావత్, రాష్ట్ర బిజెపి నాయకులతో కేంద్ర మంత్రి తోమర్ చర్చలు జరిపారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ పుష్కర్ సింగ్ ధామికే వైపునకే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన పుష్కర్‌సింగ్ ధామి గవర్నర్ బేబీరాణి మౌర్యను కలిసారు.పుష్కర్‌సింగ్ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపొందారు. -
హిమాలయాల్లో కింగ్ కోబ్రా.. అసాధారణ విషయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు మొట్టమొదటి సారి ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. హిమాలయాల్లో సుమారు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా సంచారాన్ని గుర్తించారు. మంచు వాతావరణంలో ఇంత ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో దీని గురించి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ అటవి శాఖ అధికారులు ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం పాములు వంటి శీతల రక్త జీవులు టెరాయి ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో కనిపించగా.. కొండ ప్రాంతాల్లో 2400 మీటర్ల ఎత్తులో కనిపిస్తాయి. కానీ హిమాలయాల వంటి మంచు ప్రాంతంలో ఇంత ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారం కనిపించడం ఇదే ప్రథమం కాక అసాధరణ విషయం అని నివేదిక తెలిపింది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగాలని సూచించింది. (చదవండి: వైరల్: కింగ్ కోబ్రాతో ఆట అదుర్స్!) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌లో భాగంగా ఉత్తరాఖండ్ అటవిశాఖ అధికారులు నైనిటాల్ జిల్లాలోని ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు తొమ్మిది నెలల పాటు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వీరు అనేక చోట్ల కింగ్ కోబ్రా నివాసాలను గుర్తించారు. సాధారణంగా పాములు వంటి శీతర రక్తం కల జీవులు బయటి వేడి మీద ఆధారపడతాయి. ఈ క్రమంలో అవి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను తమ ఆవాసాలుగా చేసుకుంటాయి. ఈ సందర్భంగా సంజీవ్ చతుర్వేది అనే అధికారి మాట్లాడుతూ.. ‘ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా గూళ్లను(పుట్టలు) చూశాం. ఇంత ఎత్తులో మంచు ప్రాంతంలో ఇవి కనిపించడం నిజంగా రికార్డే. గతంలో డెహ్రాడూన్‌లో 2,303 మీటర్ల ఎత్తులో, సిక్కింలో 1088 మీటర్ల ఎత్తులో, మిజోరాంలో 1170 మీటర్ల ఎత్తులో.. నీలగిరిలో 1830 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించాము. ప్రస్తుతం నైనిటాల్లో గుర్తించిన కింగ్ కోబ్రా తన ఆవాసంగా పైన్ చెట్ల ఆకులను వినియోగించుకుంది. వీటికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు వ్యాపించడంలో ప్రతి ఏటా ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి’ అన్నారు. (చదవండి: ‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’) సాధారణంగా కింగ్ కోబ్రాలు ఎక్కువగా పశ్చిమ, తూర్పు కనుమల ప్రాంతంలో, సుందర్బన్స్ మాంగ్రూవ్స్, ఒడిశాలో కనిపిస్తాయి. అయితే కోబ్రాలు ఏ వాతావరణంలో అయినా త్వరగా కలిసిపోతాయని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకుంటాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులకు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అంటున్నారు నిపుణులు. దీని కారణంగా చల్లని ప్రదేశాలు కూడా వేడిగా మారుతున్నాయని.. ఫలితంగా పాములు మంచు ప్రాంతాల్లో కూడా నివసించగల్గుతున్నాయన్నారు. అంతేకాక ఇంత ఎత్తు ప్రాంతంలో జనసంచారం పెరగడం.. ఫలితంగా చెత్తా చెదారం పెరుకుపోవడంతో ఎలుకలు ఇక్కడ ఉంటున్నాయని.. ఇవి పాములను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఏది ఏమైనా ఈ అరుదైన విషయంపై సమగ్ర శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు. -
మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది: నటి
ముంబై: ‘యెహ్ రిష్తా క్యా కెహల్తా హై’ ఫేం నటి మోహనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోహనా కుమారి మాట్లాడుతూ.. ‘ఇది నిజం. నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం మేమందరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాము. మాకు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని.. త్వరలోనే కోలుకుంటామని వైద్యులు తెలిపారు. మేము అదే నమ్ముతున్నాం’ అన్నారు. తొలుత ఆమె అత్త అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. ఆమెను రిషికేశ్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మోహనా కుటుంబంలో పని చేస్తున్న వారికి కూడా కరోనా పాజిటటివ్‌గా తేలడంతో వారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మోహనా ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ కుమారుడు సుయేష్ రావత్‌ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త, కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌లో నివసిస్తోంది. (ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
ఒక్కడి కోసం భార్యలమంటూ ఐదుగురు వచ్చారు
డెహ్రడూన్: చనిపోయిన ఓ వ్యక్తికి భార్యనంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళలు ఆస్పత్రికి వచ్చిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హరిద్వార్, రిషికూల్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ ఆదివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి భార్య స్థానికులు సాయంతో సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ.. సదరు లారీ డ్రైవర్ మృతి చెందాడు. అతడు సోమవారం ఉదయం 4 గంటలకు చనిపోయాడు. అతడితో పాటు వచ్చిన మహిళ ముందుగానే భార్యను అని చెప్పుకుంది. ఆ తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మరో నలుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు తాము లారీ డ్రైవర్ భార్యలమంటూ ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాన్ని తమకు అప్పగిస్తే.. అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో గందరగోళం ఏర్పడింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను ఒక్కొక్కరిని పిలిచి విచారించగా వారంతా సదరు లారీ డ్రైవర్‌కు భార్యనని తెలిపారు. దాంతో పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాల్సిందిగా కోరారు. తమ దగ్గర అలాంటివి ఏం లేవన్నారు. అంతేకాక అంత్యక్రియలు నిర్వహించడం కోసం మృత దేహాన్ని తమకు అప్పగించమంటూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. దాంతో ఈ సారి తల పట్టుకోవడం పోలీసుల వంతయ్యంది. చివరకు ఐదుగుర్ని కలిసి చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా పోలీసులు సూచించారు. అందుకు ఆ మహిళలు కూడా అంగీకరించిడంతో.. పోలీసులు లారీ డ్రైవర్ మృతదేహాన్ని వారికి అప్పగించారు. దాంతో సమస్య పరిష్కారమయ్యింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో బస్సు లోయలో పడిపోయి ఇద్దరు మృతి చెందగా.. మరో చోట కారు యాక్సిడెంట్లో ఒకరు మరణించారు. బస్సు ప్రమాద సంఘటన పూరి జిల్లా ఖాబ్ర గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బస్సు ఓ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కారు యాక్సిడెంట్ చమోలీ జిల్లా కుంజో గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. -
వారి పెళ్లి మా చావుకొచ్చింది
డెహ్రడూన్ : వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం ఔలీ ప్రాంతంలో జరిగిన ఓ కుబేరుడి వివాహ వేడుక మున్సిపాలిటీ అధికారులకు సమస్యలు తెచ్చి పెట్టింది. భారీ ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో చెత్త కూడా అంతే మొత్తంలో పొగయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చెత్తను తొలగించలేక మున్సిపాలిటీ సిబ్బంది తల పట్టుకుంటున్నారు. వివరాలు.. భారత్‌కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. అనేక వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఈ ఏడాది గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో బిలియనీర్ అజయ్ గుప్తా కుమారుడు సూర్యకాంత్ వివాహం జూన్ 18-20 మధ్య, అజయ్ సోదరుడు అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ వివాహం జూన్ 20-22 మధ్య జరిగింది. గ్రాండ్‌గా నిర్వహించిన ఈ వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ నటులు, యోగా గురు బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల కోసం గుప్తా కుటుంబం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను బుక్ చేసుకుంది. దాదాపు రూ. 200కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వివాహాం జరిపించారు. అయితే, ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. గుప్తాల వివాహం వల్ల దాదాపు 40 క్వింటాళ్ల చెత్త పోగైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో ఓ బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు. ‘ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు కన్పిస్తున్నాయి. పశువులు మేత కోసం ప్రతి రోజు ఇక్కడ సంచరిస్తుంటాయి. ఒకవేళ అవి ఈ ప్లాస్టిక్‌ను తింటే ఏంటి పరిస్థితి.. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తార’ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హిమాలయాల్లో ఓ పర్వతానికి వాజ్‌పేయ్ పేరు
డెహ్రడూన్ : భారత మాజీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాలయాల్లోని ఓ పర్వాతానికి వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఉత్తరఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ప్రకటించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘వాజ్‌పేయి వల్లనే ఉత్తరఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆయన మా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును ఎన్నటికి మరవం. వాజ్‌పేయి ప్రకృతి ప్రేమికుడు. అడవులు, పర్వతాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్లే హిమలయాల్లోని ఓ పర్వతానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’ అని తెలిపారు. వాజ్‌పేయి మరణించిన తరువాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, నాయకులు కేంద్రం ఆమోదంతో మాజీ ప్రధాని గౌరవార్థం తమ తమ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం బీజేపీ నాయకుడి గౌరవార్థం రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలకు వాజ్‌పేయి పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ త్వరలో నిర్మించబోయే చత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్’ను ‘అటల్ నగర్’గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అటల్ బిహారి వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. -
‘నిర్మలా సీతారామన్‌కి ఇదే ఆఖరి రోజు’
డెహ్రడూన్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేద్దామంటూ వాట్సాప్‌లో సందేశాలు పంపుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 66, ఐటీ యాక్ట్ కింద వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌ఘర్ జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. రక్షణ మంత్రి పర్యటన నేపథ్యంలో కొందరు ఆమెను అంతమొందించాలంటూ ఓ వాట్సాప్ గ్రూప్‌లో సందేశాలు పంపుకుంటున్నట్లు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు సదరు వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన సందేశాలను పరిశీలించారు. ‘వాటిలో నేను సీతారామన్‌ని కాల్చేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు’ అంటూ ఓ ఇద్దరు వ్యక్తులు పంపుకున్న సందేశాలు ఉన్నాయి. ఈ మెసేజ్‌లు ఆధారంగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాగిన మైకంలో వారు ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనప్పటికి దీన్ని మాత్రం చిన్న విషయంగా భావించటం లేదని పోలీసులు తెలిపారు. అందుకే వీరిద్దరికి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అంతేకాక సదరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కోసం కూడా వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉత్తరాఖండ్ డ్రామా!
అవసరార్ధం అభిప్రాయాలు ప్రకటించడం తప్ప దేనిపైనా నికరమైన, సూత్రబద్ధమైన వైఖరిని ప్రదర్శించలేని రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకు ఉత్తరాఖండ్ తాజా ఉదాహరణ. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలైన ఎమ్మెల్యేల తిరుగుబాటు చివరకు ఆ ప్రభుత్వ మనుగడకే ముప్పు కలిగించే స్థాయికి చేరుకోవడం... కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం లాంటి పరిణామాలు అందరినీ విస్మయపరిచాయి. రాష్ట్ర ప్రభు త్వానికి బలం ఉన్నదో లేదో నిర్ణయించడానికి ఈ నెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ఏ ప్రభుత్వానికైనా అసెంబ్లీలో జరిగే బలపరీక్షే కీలకం. ఆ బలపరీక్షలో నెగ్గితేనే, అత్యధిక సభ్యుల విశ్వాసం చూరగొంటేనే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించాలి. ఈ సంగతిని ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పి 22 ఏళ్లు దాటుతోంది. అంతకు ముందుతో పోలిస్తే ఆ తీర్పు వెలువడ్డాక కేంద్రంలో అధికారం చలాయించే పాలకులు కాస్త తగ్గిన మాట వాస్తవమే అయినా అలాంటి చర్యలకు పూర్తిగా స్వస్తి పలకలేదు. బొమ్మైకేసుకు ముందు 15 సంవత్సరాలు...ఆ తర్వాత 15 సంవత్స రాలు కొలమానంగా తీసుకుని రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే 356వ అధికరణను కేంద్రంలో అధికారంలో ఉండే పాలకులు ఎన్నిసార్లు ప్రయోగించారని ఒక సామాజిక శాస్త్రవేత్త లెక్కలుగట్టినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. బొమ్మైకేసుకు ముందు ఈ అధికరణను 40 సార్లు...ఆ తర్వాత 11 సార్లు అమలు చేశారని ఆయన 2012లో తేల్చిచెప్పారు. న్యాయస్థానాల భయంతో పాలకులు కాస్త తగ్గారని ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్రపతి భావించినపక్షంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని 356 అధికరణ చెబుతోంది. కానీ తమకు నచ్చని ప్రభుత్వాన్ని సాగనంపడానికే ఈ అధికరణ కేంద్రంలోని పాలకులకు అక్కరకొస్తున్నది. రాష్ట్రపతి పదవిలో ఉండేవారు ఇలాంటి చర్యల విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తే ఈ రకమైన పోకడలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ కె.ఆర్. నారాయణన్ ఒక్కరే రాష్ట్రపతిగా ఈ విషయంలో దృఢంగా వ్యవహరించారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన సిఫార్సును ఒకసారి, బిహార్ సర్కార్‌ను బర్తరఫ్ చేసే సిఫార్సును మరొ కసారి 1997లో ఆయన తోసిపుచ్చారు. అంతకుముందూ, ఆ తర్వాతా ఎవరూ ఇంత స్వతంత్రంగా వ్యవహరించిన సందర్భాలు కనబడవు. కేంద్ర-రాష్ట్ర సంబం ధాలపై నియమించిన సర్కారియా కమిషన్ సైతం 356వ అధికరణ దుర్విని యోగాన్ని తప్పుబట్టింది. అప్పటివరకూ మొత్తంగా 75 సందర్భాల్లో ఈ అధికర ణాన్ని ఉపయోగిస్తే అందులో కేవలం 26 సార్లు మాత్రమే ‘సరైన కారణాలు’ ఉన్నాయని 1988లో సమర్పించిన నివేదికలో తేల్చిచెప్పింది. ఈనెల 31న బలనిరూపణ చేసుకోవాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఆదేశాల ద్వారా రాష్ట్రపతి పాలన విధింపుపై స్టే విధించి హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినట్టు భావించ వచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వానికి నైతికంగానూ, చట్టపరంగానూ ఎదురుదెబ్బ తగిలినట్టే. వాస్తవానికి ఈ నెల 28న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధపడాలని రావత్ సర్కారుకు ఆ రాష్ట్ర గవర్నర్ కెకె పాల్ చేసిన సూచనను సజావుగా అమలు జరగనిచ్చి ఉంటే ఆ ప్రభుత్వం ఉండటమో, ఊడటమో తేలిపోయేది. కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా హఠాత్తుగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. ఇది తొందర పాటు చర్యేనని హైకోర్టు ఆదేశాలు తెలియజెబుతున్నాయి. రావత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడాన్ని కూడా హైకోర్టు ఒకరకంగా నిలిపివేసినట్టే లెక్క. 31న జరిగే బలపరీక్షలో వారు కూడా ఓటేసే అవకాశాన్ని కల్పించడం ఇందువల్లే కావొచ్చు. అయితే, ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఉన్న వివాదాన్ని తేల్చేవరకూ వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. మొత్తంమీద హైకోర్టు ఉత్తర్వులు అధికారాన్ని కోల్పోయిన రావత్‌కూ, సభ్యత్వం రద్దయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. లోగడ అరుణాచల్ ప్రదేశ్‌లోనూ, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా తనదీ కాంగ్రెస్ చూపిన బాటేనని ఎన్డీఏ సర్కారు చెప్పినట్టయింది. ఉత్తరాఖండ్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం విషయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరినట్టు ఓటింగ్‌కు స్పీకర్ అనుమ తించకపోయి ఉండొచ్చు. రాజ్యాంగపరంగా, నైతికంగా అది దోషమే కావొచ్చు. ఆ విషయంలో న్యాయస్థానాలు రాజ్యాంగం అనుమతించిన మేరకు జోక్యం చేసు కుంటాయి. జనం అంతిమంగా తీర్పునిస్తారు. అంతేతప్ప దాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకోవడం మంచిది కాదు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయకుండా ఉంటే మంచిదని కేంద్రం గుర్తించాలి. తాము విపక్షంలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడాన్నీ, అప్పుడు తాము తీసుకున్న వైఖరినీ బీజేపీ నేతలు మర్చిపోకూడదు. ఉత్తరాఖండ్ అనుభవంతో కాంగ్రెస్‌కు తత్వం బోధపడినట్టుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేయడం అప్రజాస్వామికమని వాదిస్తోంది. అంతకన్నా ముందు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తే ఇలాంటి తిప్పలు రావని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. ఆ పని చేస్తే కనీసం మణిపూర్‌లోనైనా ప్రభుత్వాన్ని రక్షించు కోగలుగుతామని గ్రహించాలి.