House wall
-
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రాము అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడుధాటికి ఇంటి గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాంతిదూతగా ముహమ్మద్
ప్రవక్త జీవితం ఒకసారి కాబాగృహ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు, తోటి పిల్లలంతా ఇటుకలు మోస్తుంటే, తను కూడా అందులో పాల్గొన్నారు. భుజాలు నొప్పెడుతున్నాయని పిల్లలంతా ఒంటిపైని వస్త్రం తీసి భుజంపై పెట్టుకొని మోస్తున్నారు. కాని చిన్నారి ముహమ్మద్ మాత్రం ఒంటిపైని వస్త్రాలు తీయలేదు. అబ్బాయి భుజాలెక్కడ కందిపోతాయోనని బాబాయి అబూతాలిబ్ బలవంతాన ప్రయత్నం చేస్తే, వెంటనే ఆయన స్పృహతప్పి పడిపొయ్యారు. మరో సందర్భంలో, స్నేహితుల ప్రోద్బలం, ఒత్తిడి మేరకు గ్రామంలో జరిగే ఓ వినోద కార్యక్రమానికి బయదేరారు. కాని మార్గమధ్యంలోనే ఓ ఇంట్లోంచి వీనుల విందైన మధుర గానమేదో వినిపించేసరికి అక్కడే ఆగిపోయారు. వింటూవింటూ అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు కూడా ఇలాగే జరిగింది. అంటే, అనవసర, ఉబుసుపోని కార్యకలాపాల్లో పాల్గొనకుండా దైవికంగానే ఏర్పాటు జరిగిపోయిందన్నమాట. చిన్నారి ముహమ్మద్ (స) బాల్యం, యవ్వనం ఎలాంటి మనోవికారాలకు తావులేకుండా నిష్కళంకంగా, నిర్మలంగా, పవిత్రంగా గడిచింది. ఆయన్ను వ్యతిరేకించేవారు సైతం ఆయన నైతికవర్తనాన్ని, శీలసంపదను ప్రశంసించకుండా ఉండలేకపోయేవారు. ఈ సంధి ఒప్పందంలో ముహమ్మద్ (స) కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఇలాంటి శాంతి ఒప్పందాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన తరచూ చెప్పేవారు. ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ, న్యాయప్రియత్వం, రుజువర్తనం, సత్యసంధత, సౌజన్యత, సౌహార్థ్రతల కారణంగా జాతి ఆయనను ‘అమీన్’ అన్న బిరుదుతో గౌరవించింది. ఖురైష్, హవాజన్ తెగల మధ్య జరిగిన ఒక యుద్ధంలో ఆయన బాబాయిలతో కలసి పాల్గొన్నారు. ‘ఫుజ్జార్ ’ పేరుతో ప్రసిద్ధి చెందిన చారిత్రక సమరం అది. అంతటి భయానక సమరంలో బాబాయిల వెంట పాల్గొన్నారనే గాని, ఏ ఒక్కరిపైనా చేయెత్తిన దాఖలాలు లేవు. ఎన్నో కుటుంబాలను బలిగొన్న ఈ యుద్ధం పట్ల కొంతమంది సహృదయులు, శాంతికాముకులు ఎంతో కలత చెందారు. చిన్నారి ముహమ్మద్ పెదనాన్న సారధ్యంలో కొందరు ప్రముఖులు సంధికోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఫలితంగా రెండు తెగల మధ్య సంధి కుదిరింది. ‘హిల్ ఫుల్ ఫుజూల్’గా ఇది చరిత్రకెక్కింది.అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు. పగ, ప్రతీకారాలతో, అశాంతి అరాచకాలతో సతమతమవుతున్న ప్రజలకు శాంతి, సంతృప్తి, జ్ఞానకాంతిని పంచాలని ఆయన బలంగా కాంక్షించేవారు. నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైన ఈ సమాజాన్ని ఎలాగైనా దారికి తేవాలని తపన పడేవారు. ఈ ఆలోచనలతోనే అలాకాలం గడుస్తూ పోతోంది. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
కూటి కోసం వస్తే..కడుపుకోత
గోడ కూలి ఇద్దరు చిన్నారుల దుర్మరణం హైదరాబాద్: పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆ దంపతులకు కడుపుకోత మిగిలింది. ఇంటిగోడ కూలి వారి ఇద్దరు పిల్లలు నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో తల్లిదండ్రులు బయటపడ్డారు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. కాగా ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయికి చెందిన చింతకుంట రాజు కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీగా పని చేస్తున్నాడు. రాజు తన భార్య జ్యోతి, కుమారుడు సాయిచరణ్(ఏడాదిన్నర), కుమార్తె నవ్య(రెండున్నర)లను తీసుకొని గత ఆదివారం(29న) బోరబండ సైట్-3లోని వీకర్స్ సెక్షన్ దేవయ్యబస్తీలో వాంబే పథకంలో నిర్మించిన ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. సోమవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 10.30 ప్రాంతంలో ఇంటి మధ్యలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గోడ పక్కనే పడుకుని ఉన్న చిన్నారులు సాయిచరణ్, నవ్య తలలకు తీవ్రగాయాలు కాగా... రాజు, జ్యోతిలకు స్వల్ప గాయాలయ్యాయి. గోడ కూలి పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్లో ఉంటున్న వారు వచ్చి గాయాలకు గురైన చిన్నారులను బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. స్వల్పగాయాలకు గురైన తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ రమణగౌడ్, ఎస్ఐ లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీరించారు. చిన్నారుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాజు,జ్యోతి దంపతుల మధ్య రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. గోడ కూలినప్పుడు పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్లో ఉండే యువకులు వెళ్లి తలుపు తట్టగా చాలా సేపటి వరకూ తెరవకపోవడం, పిల్లలకు తీవ్రగాయాలై, తల్లిదండ్రులకు స్పల్పగాయాలు కావడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలిన గోడ అతి పురాతనమైందని.. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రమాదవశాత్తూ ఇంటిగోడ కూలి ఐదుగురు మృతి
మణిపురి: ప్రమాదవశాత్తూ ఓ ఇంటి గోడ కూలి ఐదురుగు కుటుంబ సభ్యులు దుర్మరణం పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మణిపురి జిల్లా ఒన్హా గ్రామంలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను రిస్క్యూ టీం వెలికితీశారు. వారిలో విర్మా దేవి(70), మినా దేవి(35), ఆమె కుమారుడు రాహుల్ (17), ఇద్దరు ఆడపిల్లలు శశి(14), శివానీ(9)లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మృతిచెందిన వారి కుటుంబానికి లక్షన్నర రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ వీకే పన్వర్ పేర్కొన్నారు.