ఆస్ట్రేలియాలో ఓ భారత సంతతి కుటుంబం ఒకటి రేసిజం దాడికి గురైంది. మెల్బోర్న్ లిన్బ్రూక్ హోటల్ కార్ పార్క్లో ఆ కుటుంబంపై దాడి జరిగింది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తిని దుండగులు తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో ఒకరోజంతా ఉన్న బాధితుడు.. కోలుకున్నాక ఆ అనుభవాన్ని స్థానిక మీడియాకు వెల్లడించారు.
తన సోదరిని రక్షించే క్రమంలో 54 ఏళ్ల లిన్ బామ్ దారుణంగా గాయపడ్డారు. ఆయన్ని కిందపడేసి పిడిగుద్దులు గుద్దడంతో పాటు కాలిలో కడుపులో తన్నారు. ‘జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఊహించలేదు. కిందపడేసి కాళ్లతో తన్నారు’ అంటూ బాధితుడు బామ్ మీడియా ముందు వాపోయారు. కారు దిగి వెళ్తున్న మాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశం విడిచిపొమ్మని బూతులు తిట్టారు. రేసిజం గురించి తెలుసు. కానీ, ఈ స్థాయిలో తమపై దాడి చేయడం ఘోరమని అంటూ బామ్ సోదరి జాక్వెలిన్ ప్రకాశమ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి.. 23 ఏళ్ల కెర్రీ ప్రకాశమ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
కెర్రీ.. తన తండ్రి కెయిత్, తల్లి జాక్వెలిన్, అంకుల్ లిన్పై ఈ దాడి జరిగిందంటూ ఒక పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 12న రాత్రి ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని ఆరోపిస్తోంది ఆ కుటుంబం. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment