ఆమె పంచ్కి..విమానం ఆగింది | Cockpit punch-up as rowdy female passenger 'decks easyJet pilot' | Sakshi
Sakshi News home page

ఆమె పంచ్కి..విమానం ఆగింది

Published Fri, May 13 2016 4:43 PM | Last Updated on Tue, Oct 9 2018 5:31 PM

ఆమె పంచ్కి..విమానం ఆగింది - Sakshi

ఆమె పంచ్కి..విమానం ఆగింది

మాంచెస్టర్: విమానంలో ఓ యువతి అనుచిత ప్రవర్తన విమాన ఆలస్యానికి కారణమైంది. ఈ సంఘటన మాంచెస్టర్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. సైప్రస్లోని పపోస్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈజీ జెట్ఫ్లైట్లో ప్రవర్తనలో తేడా ఉన్న ఓ యువతిని విమాన సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి సిబ్బంది సమక్షంలోనే పైలెట్ పై దాడికి దిగింది.  ఆగ్రహంతో ఊగిపోతూ పైలట్ మోహంపై పంచ్ల వర్షం కురిపించింది. దీంతో వివాదం చెలరేగింది.

అటు పైలెట్పై దాడి చేసినందుకుగానూ గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఆ అమ్మడిని అరెస్ట్ చేశారు. రెండు గంటలు ఆలస్యం తర్వాత విమానం తిరిగి బయలుదేరింది. అయితే సదరు యువతి మాదకద్రవ్యాల కేసులో పోలీసుల వాంటెడ్ లిస్ట్లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.  
   
ఇలాంటి ఘటనే గత ఏడాది కూడా ఈజీ జెట్ఫ్లైట్లో చోటు చేసుకుంది. సాండ్ విచ్కోసం చాలా సేపు వేచి చూసిన ఓ ప్రయాణికుడు విమాన అటెండెంట్పై దాడికి దిగాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement