బీహార్లో ముజఫర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు.
పాట్నా: బీహార్లో ముజఫర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చికిత్స నిమిత్తం ముజఫర్పూర్లోని శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ప్రసాదం తినడం వల్ల వాంతులు అయ్యాయని పోలీసులు చెప్పారు. వీరికి వెంటనే ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ముజఫర్పూర్ తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా మెరుగవుతున్నట్టు వైద్యులు చెప్పారు.