eating prasad
-
ప్రసాదం తిని 55 మందికి అస్వస్థత
పాట్నా : బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని మీనాపూర్ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని దాదాపు 55 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ముజఫర్‌పూర్ నగరంలోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మంగళవారం తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు మహిళలు ఉన్నారని వెల్లడించారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం ప్రసాదం తిన్న వెంటనే 55 మందికి కడుపు నొప్పి వచ్చి వాంతులయ్యాయని చెప్పారు. -
ప్రసాదం తిన్న భక్తులు... పరిస్థితి విషమం
పాట్నా: దేవాలయంలో దేవుని ప్రసాదం తిని 95 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సంఘటన బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని భద్రపూర్ బ్లాక్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎప్పటిలాగే స్థానిక దేవాలయంలో దేవుడ్ని భక్తులు సందర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవాలయ ప్రతినిధులు ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రసాదం తిన్న భక్తులు వెంటనే కడుపులోనొప్పి అంటూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. దాంతో దేవాలయం యాజమాన్యం భక్తులను హుటాహుటిన దర్బంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 95 మందిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రపూర్ రాష్ట్ర రాజధాని పాట్నాకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనారోగ్యం పాలైన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్దులు ఉన్నారని ఉన్నతాధికారి తెలిపారు. -
ప్రసాదం తిని 60 మందికి అస్వస్థత
పాట్నా: బీహార్‌లో ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చికిత్స నిమిత్తం ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ప్రసాదం తినడం వల్ల వాంతులు అయ్యాయని పోలీసులు చెప్పారు. వీరికి వెంటనే ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ముజఫర్‌పూర్ తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా మెరుగవుతున్నట్టు వైద్యులు చెప్పారు. -
ప్రసాదం తిని 45 మందికి అస్వస్థత
ఉత్తర త్రిపురలోని కంచన్‌పూర్‌లో నిన్న రాత్రి జరిగిన దైవ సంబంధ కార్యక్రమంలో ప్రసాద వితరణలో భాగంగా ప్రసాదం తిని 45 మంది అస్వస్థతకు గురయ్యారని ఆ రాష్ట్ర వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారి మంగళవారం అగర్తలాలో వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారందరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అలాగే రెండు వైద్య బృందాలను ఇక్కడ నుంచి ప్రత్యేకంగా పంపినట్లు పేర్కొన్నారు. వైద్యులు రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే వారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రసాదం కలుషితం కావడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఆ ప్రసాదం తాలుక నమూనాను ఇప్పటికే సేకరించి, పరిశోధనశాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.