అనారోగ్యంతో ఏఎస్‌ఐ మృతి
Published Sun, Sep 4 2016 11:29 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కర్నూలు: కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహానంది పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ యూసుఫ్ (52) బుధవారపేటలోని ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈయన చిప్పగిరితోపాటు నంద్యాల స్పెషల్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో పని చేశారు. ఈయనకు భార్య ముస్తరిబేగం, కుమారుడు, కూతురున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణ హాస్పిటల్‌కు వెళ్లి భౌతికాయం శ్రద్ధాంజలి ఘటించారు. దహన సంస్కారాల నిమిత్తం పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.15వేల నగదును భార్య ముస్తరిభేగంకు అందజేశారు. త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, సహాయ కార్యదర్శి దామోదర్‌రెడ్డి తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.
Advertisement
Advertisement