నల్లగొండ: శిశుగృహలో పిల్లలు అనారోగ్యంతో చనిపోతుంటే ఏం చేస్తున్నారు? మీరంతా బాధ్యత గా వ్యవహరిస్తే ఇంతమంది చనిపోయేవారా? అసలు ఇన్నేళ్ల సర్వీసులో ఒక్కసారైనా రికార్డులను పరిశీలించారా? అని నల్లగొండ జిల్లా శిశు సంక్షేమ కమిటీ పనితీరుపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ వారం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘చిన్నా రుల మృత్యుఘోష’ కథనంపై స్పందించిన ఆమె గురువారం శిశుగృహలో విచారణ చేపట్టారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మంది పిల్లలు బలహీనంగా ఉన్నారు? ఎంతమంది బరువు తక్కువగా ఉన్నారు? అనే వివరాలు రికార్డుల్లో ఎందుకు నమోదు చేయలేదని సీడబ్ల్యూసీ, శిశుగృహ సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లల అనారోగ్య పరిస్థితి విషమించి చివరి నిమిషంలో నిలోఫర్‌కు తీసుకెళుతున్నారని, దాంతో సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని జేడీ తెలిపారు. శిశుగృహకు పిల్లలు వచ్చిన తర్వాత సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
ఆరు మాసాల్లో 11 మంది మృతి
విచారణ అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసిన జేడీ.. చిన్నారుల మృతికి గల కారణాలపై చర్చించారు. ఆరు మాసాల్లో 11 మంది ఆడశిశువులు మృతి చెందారని కలెక్టర్ చెప్పారు. చిన్నారుల మృతికి బాధ్యులు ఎవరైనా సరే కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని జేడీ తెలిపారు.
పిల్లలు చనిపోతుంటే ఏం చేస్తున్నారు?
Published Fri, Nov 10 2017 1:09 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment