జన్మభూమి సభలోనే అస్వస్థత
Published Wed, Jan 4 2017 12:14 AM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM
- పింఛన్‌కోసం వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడు
- గూడూరు వార్డు సభలో ఘటన
గూడూరు: మండల కేంద్రంలోని వార్డు సభకు మంగళవారం పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు పంపిణీ ఆలస్యం కావడంతో తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానిక ఏబీఎం పాఠశాల ఆవరణలోæ చైర్‌పర్సన్ ఇందిరాసుభాషిణి అ«ధ్యక్షతన 3వ వార్డు సభను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ లక్ష్మికాంతరావు, కార్యాలయ మేనేజర్ వెంకటేశ్వర్లు, టీపీఎస్ నరసింహమూర్తి తదితరులు హాజరయ్యారు. సభను ఆలస్యంగా ప్రారంభించడంతో పాటు అధికారుల ప్రసంగాలు ముగిసే వరకు పింఛన్ పంపిణీ మొదలు పెట్టలేదు. పింఛన్ కోసం ఉదయం నుంచి సభలో వేచి ఉన్న కాంట్రాక్టర్ నారాయణ అనే వృద్ధుడు నీరసించి అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
Advertisement