తెర్లాం: ఆ యువతి రెండు కాళ్లు రైలు ప్రమాదంలో కొల్పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో తనను పరామర్శించేందుకు వచ్చిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వికలాంగ పింఛన్, రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీను నెరవేర్చలేదు. ఈ క్రమంలో జన్మభూమి కార్యక్రమంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు చక్రాల బండిపై తల్లి సహాయంతో వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..వెలగవలస గ్రామానికి చెందిన రాగోలు నీలవేణికి రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి.
వికలాంగ పెన్షన్ మంజూరు చేయమంటే తన తండ్రికి పింఛన్ వస్తుందని, ఆ రేషన్ కార్డులో తన పేరుందని పింఛన్ ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయకపోతే ఎలా బతకాలని నీలవేణి అధికారులను ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తనకు వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని వేడుకొంది.
Comments
Please login to add a commentAdd a comment