రమేశ్(ఫైల్)
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండలం ఎనగండ్లకు చెందిన ధూంధాం కళాకారుడు పెద్ద రమేశ్(35) అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమేశ్ కొన్ని రోజులుగా మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు లయా కళాబృందం సభ్యుడు శేఖర్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డప్పు కళాకారుడిగా రమేశ్ పోషించిన పాత్ర మరవలేనిదని తోటి కళాకారులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతిపై స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment