
మహిళా ఖైదీలు చికిత్స పొందుతున్న జేజే ఆస్పత్రి(ఫైల్)
ముంబై : 82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురైన సంఘటన శుక్రవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైయ్యారు. వారిని జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అనారోగ్యానికి గురై ఉంటారని భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్‌వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. కలరాను నివారించటానికి జైలులోని అందరికి ఆరోగ్యశాఖ వారు మందులు అందజేశారన్నారు. మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment