మ్యాన్‌హోల్ గ్రిల్స్ (మెటల్స్) దొంగతనం 45 ఏళ్ల విమల్ అనిల్ గైక్వాడ్ ప్రాణం తీసింది. భారీ వర్షాలకు గైక్వాడ్ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండేలా అధికారులు మ్యాన్‌హోల్స్‌ను మెటల్స్‌ను అమర్చారు. ఆ మెటల్స్‌ను అగంతకులు దొంగతనం చేశారు.
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విమల్ అనిల్ గైక్వాడ్ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడి మరణించారు. ఈ ఘటనలో కుటుంబానికి ఆధారమైన తన భార్య మరణానికి కారణమైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి భర్త పోలీసుల్ని ఆశ్రయించారు
‘నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నన్ను, నా ఇంటి బాధ్యతల్ని తన చూసుకునేది. ఇంటి బాధ్యతల్ని నా భార్యనే చూసుకునేది. ఆమె మరణంతో మేం సర్వం కోల్పోయాం ’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా తప్పు ఎవరిదైనా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
అనిల్ గౌక్వాడ్ ఫిర్యాదుతో పోలీసులు..ఈ దర్ఘుటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ శాఖ.. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో నివేదికను కోరింది.
నిన్న కురిసిన భారీ వర్షం వల్ల ఆర్థిక రాజధానిలో రైలు పట్టాలు, రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది .14 విమానాలు దారి మళ్లించాయి. అయితే వర్షం బీభత్సం సమయంలో గైక్వాడ్ అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భవనం గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక దళ సిబ్బంది ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కాగా, ఈ ఏడాది ముంబైలో వేర్వేరు మ్యాన్‌హోల్‌లో పడిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారు. నగరంలో మ్యాన్‌హోల్ మెటల్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని, గతేడాది ముంబైలో 791 మ్యాన్‌హోల్ కవర్ దొంగతనాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment