![30 Students Fell Sick Lost Consciousness At School In Valasapakala Kakinada - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/6/STUDENT.jpg.webp?itok=Xm7_PrR6)
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణాలను టీచర్స్, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
కాగా తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అస్వస్థతకు గురైన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్ధుల అస్వస్ధతకు గల కారణాలు తెలుసుకునేందుకు రక్త నమూనాలను వైద్యులు సేకరించారు.
మంత్రి ఆరా
కాకినాడ వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్దులు అస్వస్థతకు గురైన ఉదంతంపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment