
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మయూరేశ్వర్ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల్లో అనూహ్యంగా మధ్యాహ్నా భోజనంలో పాము కనిపించినట్లు కలకలం రేగింది. ఇంతలో ఐతే అప్పటికే ఆ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం జరిగింది.
దీంతో వారిని హుటాహుటినా రామ్‌పూర్‌హట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే పప్పు నింపిన కంటైనర్‌లో పాము కనిపించినట్లు భోజనం సిద్ధం చేసిన సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. వారిలో ఒక విద్యార్థి మాత్రం ప్రమాదం నుంచి బయటపడి.. డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.
అదీగాక మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నట్లు ఆ పాఠశాలపై ఫిర్యాదు వస్తున్నట్లు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దీపాంజన్ జానా చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని ముట్టడించి, అతడి వాహానాన్ని ధ్వసం చేసినట్లు అధికారులు తెలిపారు.
(చదవండి: దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి..)
Comments
Please login to add a commentAdd a comment