Viral Video: భారీ పాముతో చిన్నారుల వీరోచిత పోరాటం | Tree Childrens Fight Huge Snake Trying To Kill Their Pet Dog | Sakshi
Sakshi News home page

కుక్క కోసం భారీ కొండ చిలువతో చిన్నారుల పోరాటం

Published Sun, Aug 7 2022 4:00 PM | Last Updated on Sun, Aug 7 2022 4:00 PM

Tree Childrens Fight Huge Snake Trying To Kill Their Pet Dog - Sakshi

చిన్న పాము కనిపిస్తేనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. మళ్లీ ఆ వైపు వెళ్లేందుకు జంకుతారు. అయితే.. ఈ ముగ్గురు చిన్నారులు భారీ కొండ చిలువతో వీరోచిత పోరాటం చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పెంపుడు శునకాన్ని భారీ కొండ చిలువ చుట్టేసింది. దాని నుంచి విడిపించుకునేందుకు ఆ కుక్క తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. 

శునకం అరుపులు విన్న చిన్నారులు అక్కడికి చేరుకుని పాముతో వీరోచిత పోరాటం చేశారు. పాము వారిపైకి బుసలు కొడుతున్నా వారు భయపడలేదు. ఓ బాలుడు దాని తలను అదిమిపట్టేందుకు ప్రయత్నించాడు. కొద్ది సేపటికి ఓ రాడ్డు సాయంతో దాని తలను అదిమిపట్టి పామును చేతపట్టుకున్నాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు శునకాన్ని తప్పించేందుకు పామును లాగుతూ తీవ్రంగా శ్రమించారు. చివరకు దాని చెర నుంచి విడిపించారు. దీంతో బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పప్పీ. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా 19.7 మిలియన్ల మంది చూశారు. చిన్నారుల ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 

ఇదీ చదవండి: Viral Video: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement