python snake
-
చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం
చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు. #TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C — Suresh (@isureshofficial) July 30, 2023 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? -
వామ్మో.. ఎంత పెద్ద పామో!
ఆత్రేయపురం: గోదావరి వరద ప్రవాహంతో పాటు కొండ కోనల నుంచి భారీ సర్పాలు కొట్టుకుని వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొబ్బర్లంక వద్ద వరద గోదావరిలో చేపలు పట్టేందుకు ఓ మత్స్యకారుడు వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కుకుంది. ఏదో ఒక పెద్ద చేప చిక్కి ఉంటుందని భావించిన మత్స్యకారుడు ఆ వలను బయటకు లాగడంతో అందులో కొండచిలువ కనిపించింది. చాలా పెద్ద పాము కావడంతో ఒకింత భయంతోనే స్థానికులు దీనిని చూసేందుకు ఎగబడ్డారు. చివరకు ఆ కొండచిలువను మత్స్యకారులు తిరిగి గోదావరిలోకే విడిచిపెట్టారు. -
బావిలో భారీ కొండచిలువ
సాక్షి, హన్మకొండ: మంచినీటి బావిలో భారీ కొండచిలువ కనిపించడంతో నీటి కోసం వచ్చిన మహిళలు హడలిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. రోజు మాదిరిగానే ఉదయం తాగునీటిని తెచ్చుకోవడానికి మంచినీటి బావి వద్దకు వెళ్లి మహిళలకు అందులో అతిపెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో మహిళలు భయబ్రాంతులై కేకలు వేయడంతో స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: వెనక్కి తగ్గిన బీజేపీ.. కేసీఆర్ వైఫల్యాలపై రివర్స్ అటాక్ కు ‘నో’ -
సికింద్రాబాద్‌లో 14 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం..
-
చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేయడంతో వాళ్లు వచ్చి కొండ చిలువను తీసుకెళ్లారు. వివరాలు.. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వెనుక వైపు ఉన్న రైల్వే కాలనీ పార్కులో మంగళవారం ఉదయం 11.45 గంటల సమయంలో పార్కులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది వచ్చారు. పార్కులో ఉన్న చెత్తను ఎత్తివేస్తున్న సమయంలో అందులో ఏవో కదలికలు కనిపించాయి. మెళ్లిగా చెత్తను తొలగించి చూడగా 14 ఫీట్ల భారీ కొండ చిలువ కనబడడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. కాలనీ వారి సహాయంతో స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం వెంటనే ఆ కొండ చిలువను పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం పిల్లలు, పెద్దలు పార్కులో వాకింగ్‌కు, కాలాక్షేపానికి వస్తుంటారని, ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నామని కాలనీ వాసులు చెప్పారు. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు కాలనీ పార్కులో చెత్తచెదారాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు -
తాగిన మత్తులో కొండ చిలువతోనే ఆటలు
-
తాగిన మత్తులో కొండ చిలువతోనే ఆటలు.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది!
తాగిన మైకంలో కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తే షాక్ అవుతుంటాము. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పని.. ప్రాణాలకు మీదకు తెచ్చింది. బతుకు జీవుడా అన్నట్టుగా గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన బిర్జాలాల్ రామ్ భూయాన్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి ఆ ప్రాంతంలో ఉన్న డ్యామ్ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఓ భారీ కొండ చిలువ కనిపించడంతో సరదాగా దాన్ని పట్టుకుని మెడలో వేసుకున్నాడు. అనంతరం.. కొండ చిలువ అతని మెడకు చుట్టుకుంది. దీంతో, అతడు ఎంత ప్రయత్నించినా పాము రాకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న రామ్ భూయాన్ కొడుకు, అతడి స్నేహితులు కలిసి పామును విడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రామ్ భూయాన్.. నీటిలో పడిపోయాడు. ఇద్దరు యువకులు.. కొండ చిలువను విడిపించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో, బాధితులు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
Viral Video: భారీ పాముతో చిన్నారుల వీరోచిత పోరాటం
చిన్న పాము కనిపిస్తేనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. మళ్లీ ఆ వైపు వెళ్లేందుకు జంకుతారు. అయితే.. ఈ ముగ్గురు చిన్నారులు భారీ కొండ చిలువతో వీరోచిత పోరాటం చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పెంపుడు శునకాన్ని భారీ కొండ చిలువ చుట్టేసింది. దాని నుంచి విడిపించుకునేందుకు ఆ కుక్క తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. శునకం అరుపులు విన్న చిన్నారులు అక్కడికి చేరుకుని పాముతో వీరోచిత పోరాటం చేశారు. పాము వారిపైకి బుసలు కొడుతున్నా వారు భయపడలేదు. ఓ బాలుడు దాని తలను అదిమిపట్టేందుకు ప్రయత్నించాడు. కొద్ది సేపటికి ఓ రాడ్డు సాయంతో దాని తలను అదిమిపట్టి పామును చేతపట్టుకున్నాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు శునకాన్ని తప్పించేందుకు పామును లాగుతూ తీవ్రంగా శ్రమించారు. చివరకు దాని చెర నుంచి విడిపించారు. దీంతో బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పప్పీ. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా 19.7 మిలియన్ల మంది చూశారు. చిన్నారుల ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. These kids 👏👏 pic.twitter.com/fa2yQH71Eo — figensezgin (@_figensezgin) August 5, 2022 ఇదీ చదవండి: Viral Video: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది -
అమ్మో.. కొండచిలువ
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి రూరల్ మండలంలోని రావివలస సమీపంలోని బులవంత చెరువులో సోమవారం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం చెరువు వైపు వెళ్లిన వారికి నాచులో ఈ భారీ సర్పం కనిపించడంతో పరుగులు తీశారు. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. -
భారీ కొండచిలువను ఎత్తిన క్రేన్! వైరల్ వీడియో వెనుక కథేంటంటే..
FactCheck On Giant Phython Crane Video: ‘‘7కొండల్లో 32అడుగుల కొండచిలువ. తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనబడింది’’.. అంటూ ఫేస్బుక్లో కొందరి అకౌంట్ల నుంచి ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అఫ్కోర్స్.. ఈ ప్రచారం ఫేక్ అని తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ ఎప్పుడు.. ఎందుకు అవుతుందో? అందులో ఎంత వాస్తవం ఉందనేది కనిపెట్టడమూ ఈమధ్య కాలంలో కొంచెం కష్టంగా మారిందనుకోండి. అసలు విషయంలోకి వెళ్తే.. భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజా వీడియో మాత్రం మన దేశంలోదే కాదన్న విషయం వెలుగు చూసింది. వీడియో ఇమేజ్ ద్వారా రివర్స్ చెక్ ఆప్షన్‌తో ఈ వీడియోకు సంబంధించి కొన్ని వివరాలు సేకరించాం. అక్టోబర్ 12న ‘టమన్ పెండిడికన్’(tamanpendidikan) అనే వెబ్సైట్ ద్వారా ఈ వీడియో గురించి మొదటి పోస్ట్ పడింది. అయితే పోస్ట్‌లోని భాష ఆధారంగా ఆ వెబ్సైట్ ఇండోనేషియన్ వెబ్‌సైట్‌గా నిర్ధారణ అయ్యింది. అదేరోజు ఓ ఇండోనేషియన్ యూట్యూబ్ ఛానెల్లో కూడా అప్లోడ్ అయ్యింది. Whopper 100kg python caught in Dhanbad, Jharkhand ▪️The reptile, measuring 6.1m & weighing about 100kg, is one the largest & longest ever caught #Dhanbad #Jharkhand #India #Forest #Snakes pic.twitter.com/8TmNm9DREy — 🌎 Sarwar 🌐 (@ferozwala) October 16, 2021 ఆ తర్వాత ఇది ఇండోనేషియాకు చెందినది కాదని.. మలేషియాకు సంబంధించిన వీడియో అని ప్రచారం మొదలైంది. ఆ వెంటనే ఈ భారీ కొండచిలువ చైనా-మయన్మార్ బార్డర్లో దొరికిందని, కాదు.. మేఘాలయాకు చెందినది అని, కాదు కాదు.. ఈ వీడియో జార్ఖండ్ ధన్‌బాద్(మనదేశం)లోనిదేనంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే కొన్ని హిందీ వెబ్సైట్లు ఇది అసలు మన దేశంలో కాదనే విషయాన్ని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా నిర్ధారణ చేశాయి. అసలు ఇంతకీ ఈ వీడియో కొత్తదేనా? లేదంటే పాతదా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ఇలా భారీ పాములు కనిపించిన సందర్భాల్లో చంపిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆ భారీ పామును ప్రాణాలతో ఉంచారా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు పరిరక్షణ సంఘాలవాళ్లు. ప్రస్తుతానికి ఈ వీడియో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్‌లతో ఇంటర్నెట్ను విపరీతంగా షేక్ చేస్తోంది. చదవండి: ఒకటి కాదు.. రెండు ప్రాణాలు కాపాడిన పోలీసాయన(VIRAL) -
చేపల కోసం వస్తే కొండచిలువ చిక్కింది; ఫోటోలు వైరల్
భువనేశ్వర్: పామును దూరం నుంచి చూస్తేనే హడలెత్తిపోతాం. అలాంటిది చేపలకు బదులు కొండచిలువ చిక్కితే ఆ జాలరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొండి. కొంతమందికి ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఒడిశాలోని కలహండి జిల్లాలోని గొలముందా ఏరియాలో ఉన్న గంగా సాగర్ చెరువులో జాలరి రాజ్మల్ దీప్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చేపల కోసం వలవేస్తే ఏకంగా ఏడు అడుగుల పొడవున్న కొండచిలువ చిక్కింది. అదృష్టం బాగుండి ఆ కొండచిలువ అతనిపై దాడి చేయలేదు. దీంతో ఒక్కసారిగా షాకైన అతను ఆ తర్వాత తేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు కొండచిలువను వల నుంచి విడిపించి తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం కొండచిలువకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Odisha: A 7-feet long python was rescued from a fishing net near Ganga Sagar pond, Golamunda in Kalahandi district by the forest department on Saturday. The reptile was later released into the forest. pic.twitter.com/JU4sgw8r6L — ANI (@ANI) July 4, 2021 -
వామ్మో.. కాలువలో భారీ కొండచిలువ..
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–75 గ్రామంలో 12 అడుగుల కొండచిలువ సంచరిస్తూ కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఆ గ్రామ శివారులోని కాలువలో ఆహార అన్వేషణలో భాగంగా అక్కడ తిరుగుతున్న కొండచిలువని గ్రామస్తులు కొంతమంది చూసి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అధికారులు చాకచక్యంతో దానిని పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
అంతరిస్తున్న 'కొండచిలువలు'
కైకలూరు: సరీసృపాలలో అరుదైన కొండచిలువల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ మానవుల చేతుల్లో హతమవుతున్నాయి. ప్రకృతి సౌందర్యానికి నెలవైన కొల్లేరులో ఎక్కువగా ఉన్న కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. కనిపిస్తే అంతమవుతున్నాయి. కొల్లేరులో పక్షులతోపాటు వివిధ జాతుల సరీసృపాలు జీవిస్తున్నాయి. వీటిలో ఇండియన్ రాక్ పైథాన్ ఒకటి. ఈ కొండచిలువ కొల్లేరు ప్రాంత ప్రజల చేతుల్లో ఎక్కువగా దాడికి గురవుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఉప్పుటేరు పరీహవాక ప్రాంత పరిధిలో వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, ముదినేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి మృత్యువాతపడ్డాయి. కొద్ది ఘటనలలో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షిస్తున్నారు. చిత్తడి నేలలు అనుకూలం కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో 2.25 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. ఇక్కడి చిత్తడి నేలలు కొండచిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చేపలు, రొయ్యల చెరువుల సమీపంలో ఉంటున్న ఇవి చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండచిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి. అరుదైన జాతి ఇండియన్ రాక్ పైథాన్ శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇది 9.8 అడుగుల పొడవు పెరుగుతుంది. బరువు 25 కిలోల వరకు ఉంటుంది. ముదురు గోధుమ రంగుపై నల్లటి డైమండ్ మచ్చలు ఉంటాయి. విషపూరితమైనవి కావు. క్షీరదాలు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి. పూర్తిగా ఆహారం తీసుకున్నాక వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఉంటాయి. ఇవి వంద గుడ్ల వరకు పొదుగుతాయి. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వీటి సంతతి ఉంది. ఇండియన్ రాక్ పైథాన్‌ను.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎస్) హానికలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో చేర్చింది. అరుదైన కొండచిలువ ఇండియన్ రాక్ పైథాన్ విషసర్పం కాదు. ప్రజలు వీటిని చూడగానే దాడి చేస్తున్నారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐయూసీఎస్ ఈ జాతి ప్రమాదకర స్థితిలో ఉందని రెడ్ లిస్టులో పేర్కొంది. ఆటపాక గ్రామంలో గాయపడిన 11 అడుగుల కొండచిలువకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడాను. ఇవి తారసపడితే అటవీ అధికారులకు తెలియజేయండి. – డాక్టరు సూరపనేని ప్రతాప్, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్, అమరావతి చంపితే మూడేళ్ల శిక్ష కొండచిలువలు కనిపిస్తే చంపవద్దు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. అటవీశాఖ చట్ట ప్రకారం ఈ జాతిని షెడ్యూల్–1లో చేర్చారు. దీన్ని చంపితే మూడేళ్ల శిక్ష పడుతుంది. వీటికి హానిచేయకుండా అప్పగిస్తే అటవీప్రాంతాల్లో వదిలిపెడతాం. – జి.జయప్రకాష్, ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, కైకలూరు -
కుక్కపిల్ల కోసం కొండచిలువతో పోరాటం
ఒక మహిళ తన కుక్క పిల్లను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టింది. యజమాని కొండచిలువ నోటికి చిక్కిన కుక్కపిల్లని కాపాడిన విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైలీ మైల్ ప్రకారం, పదివారల వయసుగల కుక్కపిల్ల 'వాలీ' అదృష్టవసాత్తు కొండచిలువ బారిన పడకుండా తప్పించుకుంది. కొండచిలువ నోటికి చిక్కిన వాలీ బాధతో గట్టిగా అరిచింది. ఆస్ట్రేలియా, క్వీన్‌లాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన కెల్లీ మోరిస్ తన కుక్కపిల్ల అరుపులు వినగానే మేడమీద ఉన్న ఆమె ఏం జరిగిందో చూడటానికి పరుగున వచ్చింది. కుటుంబ సభ్యులతో ఆమె అక్కడికి చేరుకునే సరికి ఒక కొండచిలువ కుక్కపిల్ల మెడను చుట్టుకొని ఉంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాలీని కొండచిలువ నుంచి విడదీయగలిగారు. ఈ క్రమంలో కెల్లీకి కూడా గాయాలు అయినప్పటికీ ఆమె బాగానే ఉన్నారని 'సన్‌షైన్ స్నేక్ క్యాచర్స్ ఫేస్బుక్ పేజ్' తెలిపింది. (చదవండి: కేంబ్రిడ్జి విభాగానికి భారతీయ శాస్త్రవేత్త పేరు) 'మేము ఒక భయంకర శబ్ధన్ని విన్నాం. వాలీ ఎక్కడైన పడిపోయిందో, చిక్కుకుపోయిందో అనుకుంటూ వచ్చాం. వస్తున్న సమయంలో ఒక హారర్ మూవీ చూస్తున్నట్లుగా అనిపించింది. ఎక్కడ చూసినా వాలీ రక్తం పడి ఉంది. చివరికి తెలిసింది వాడు కొండచిలువకి చిక్కాడు' అని కెల్లీ ఏబీసీ న్యూస్‌లో తెలిపారు. కుక్కుపిల్లని కాపాడిన తరువాత కొండచిలువను ఒక కవర్లో ఉంచామని కెల్లీ అన్నారు. తరువాత వాలీని వైద్యంకోసం పశువైద్యశాలకి తీసుకెళ్లామని, తీవ్రంగా గాయపడిన వాలీ ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతుందని, వాలీకి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారని తెలిపారు. -
వైరల్: రికార్డు సృష్టించిన భారీ కొండచిలువ
వాషింగ్టన్ : ఫ్లోరిడాలో అత్యంత పొడవైన కొండచిలువను స్థానిక వేటగాళ్లు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఫ్లోరిడాలోని వాటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్‌లో గుర్తించిన ఈ ఆడ కొండచిలువ పొడువు 18.9 అడుగులు. ఇది ఇప్పటి వరకు 18.8 అడుగుల పొడవున్న కొండచిలువ రికార్డును చెరపేసి కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ర్యాన్ ఆస్బర్న్, అతని స్నేహితుడు కెవిన్ పావ్లిడిస్ ఇద్దరూ పాముల వేటగాళ్లు. వైల్డ్ లైఫ్ సొసైటీలో పనిచేసే వీరు వవిధ ప్రాంతాలలో తిరుగుతూ పాములను పట్టుకొని వారి సంస్థకు అప్పజెప్పుతారు. చదవండి: బ్లూ స్నేక్.. కనిపించేంత సాఫ్ట్ కాదు సుమీ.. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వేటలో నడుము లోతులో ఉన్న నీటిలో దిగి ఈ భారీ కొండ చిలువను పట్టుకున్నారు. తాజాగా లభించిన కొండ చిలువ బరువు 47 కిలోలు. ఈ విషయాన్ని పావ్లిడిస్ తన ఫేస్బుక్లో వెల్లడించారు. ఇంత పెద్ద పామును మునుపెన్నడూ చూడలేని, దాన్ని పట్టుకునేటప్పుడు చేతులు వణికాయని పావ్లిడిస్ పేర్కొన్నారు. కొండచిలువ కొత్త రికార్డు సృష్టించినట్లు ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్ ధృవీకరించింది. చదవండి: నోటిలో నుంచి 4 అడుగుల పాము.. -
వైరల్ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం
‘ఇక నా పని అయిపోయింది. ‘కుక్క చావు’ చావాల్సిందే. ఈ రోజుతో నా జీవితం ముగుస్తుంది. ఆ కొండ చిలువకు ఆహారంగా మారాల్సిందే’ అని అనుకుంది కొండ చిలువ నోటికి చిక్కిన ఓ కుక్క. ఇంతలో ముగ్గురు కుర్రాళ్లు కనిపించారు. వచ్చారు.. వచ్చారు.. నా వాళ్లు వచ్చారు. ఇక నువ్వు నన్నేం చేయలేవు అంటూ గంభీర ముఖంతో పాము వైపు చూసింది. ‘నీ వాళ్లు వస్తే నాకేంటే.. నా పట్టు విడిపించడం అంత వీజీ కాదు. నాతో పెట్టుకునే ధైర్యం వాళ్లకు లేదు. నా దగ్గర వచ్చేంత సాహసం చెయ్యలేరు’ అంటూ తన పట్టును మరింత బిగించింది ఆ కొండ చిలువ. కానీ కొండ చిలువ ఆశ అడియాశలు అయ్యాయి. కుక్క బతికింది. కుర్రాళ్లు హీరోలయ్యారు. వారు చేసిన సాహసం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారులను నెటింజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు. ఏ జంకు బెదురు లేకుండా కొండచిలువపై దాడి చేసి కుక్కను రక్షించారు. కుక్కను విడిపించడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. తమ చేతికి దొరికిన వాటిని కొండ చిలువపై విసురుతూ.. రాళ్లతో కొడుతూ, దైర్య సాహసాలు ప్రదర్శించారు. అప్పటకీ కొండ చిలువ కుక్కను విడవకపోవడంతో చిన్నారులు మరింతగా ప్రయత్నించారు. ఒకరు తోకను పట్టుకుంటే , మరొకరు కొండ చిలువ తలను పట్టుకున్నాడు. ఇంకొకరు కుక్కను జాగ్రత్తగా విడదీశారు. చివరికి ఎలాగోలా ప్రయత్నించి కుక్కను విడిపించారు. కుక్క అక్కడి నుంచి కుయ్యో.. మెర్రో.. అనుకుంటూ పరుగు పెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముగ్గురు కుర్రాళ్ల సాహసంపై నెటిజన్లు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. రియల్ హీరోలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. -
పాముతో పెట్టుకుంటే అంతే మరీ..
మనుషులు ఖాళీ సమయంలో బోర్ కొడితే సినిమా చూడటం, ఆటలు ఆడటమో చేస్తారు. అలా కూడా టైంపాస్ కాకపోతే పెంపుడు జంతువులైన ఏ పిల్లితోనో, కుక్కతోనో ఆడుకుంటారు. కానీ ఓ వ్యక్తి సరదా కోసం పాముతోనే ఆటలు ఆడబోయాడు. చివరకు అతగాడి జుట్టు... పాము నోటికి చిక్కి గిలగిలా కొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సెప్టెంబర్ 19న ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షల వ్యూలు, వందల్లో కామెంట్లు వచ్చాయి. వివరాలు.. పాములను పట్టే ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొండ చిలువను చేతితో గాలిలో పట్టుకుని దాని మొహంపై ఊదుతూ దానితో ఆడుకుంటు రెచ్చగొట్టెలా ప్రవర్తిస్తున్నాడు. అతను చేసే వెధవ చేష్టలకు అది కూడా నోరు తెరిచి కోపంగా అతని మీదకు లేస్తూ చివరకు నిశ్శబ్దంగా ఉండిపోయింది. పాము సైలెంట్ కావడంతో అతను దానిని ముద్దు చేస్తూ నుదిటిపై పెట్టుకున్నాడు. దీంతో ఛాన్స్ కోసం ఎదురు చూసిన కొండచిలువ.. ఒక్కసారిగా అతగాడి తలను గట్టిగా పట్టేసింది. ఇక దానిని వదిలించుకోవడానికి ఆ వ్యక్తి నానాతంటాలు పడ్డాడు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘బాగైంది.. ఇతనికి ఇలా జరగాల్సిందే’, ‘నీకు ఇలా జరగడమే కరెక్ట్.. ఇప్పుడు తెలిసిందా నొప్పి ఎలాం ఉంటుందో’, అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘జంతువులకు మర్యాద ఇవ్వాలని.. ఇప్పడు ఇతగాడికి తెలిసొచ్చిందనుకుంటా’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
కిచెన్‌లో నాగుపాము
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి జిల్లా): టీ పెట్టేందుకువంటగదిలోకి వెళ్లిన ఓ మహిళ నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో హడలిపోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చిప్ప మనోహర్ భార్య నాగమణి ఆదివారం సాయంత్రం ఇంట్లో టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లింది. బుస్బుస్మని శబ్ధం రావడంతో పరీక్షించి చూడగా వంటగది ప్లాట్ఫారం మీద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో హడలిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వచ్చి పామును ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు దాదాపు గంటసేపు కష్టపడాల్సి వచ్చింది. -
అలజడి సృష్టించిన సర్పరాజం
విశాఖపట్నం,ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎండాకాలం ధాటికి పుట్ట నుంచి బయిటపడి జనావాసాల్లోకి దూరిందేమో.. ఓ భారీ సర్పం అలజడి సృష్టించింది. ఎన్ఏడీ జంక్షన్ చేరువలోని ఎస్వీకే నగర్లో ఓ పెద్ద నాగుపాము కలకలం రేపింది. ఇక్కడ ఒక పూరింట్లో దూరి అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఇంట్లో ఒక మూలకు చేరి ఉండిపోయిన ఈ నాగుపామును ఇంట్లో వారు గుర్తించి వైఎస్సార్ కాంగ్రెస్ 42వ వార్డు అ«ధ్యక్షుడు జియ్యాని శ్రీధర్‌కు సమాచారమిచ్చారు. ఆయన మల్కాపురానికి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్‌కు కబురు పెట్టారు. సర్పం ఉన్న ఇంటి వద్దకు చేరుకున్న కిరణ్, తన వద్ద ఉన్న పరికరాల సాయంతో సర్పాన్ని చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. సుమారు పది అడుగుల పొడవున్న ఈ సర్పం చాలా విషపూరితమైనదని, జనావా సాలకు దూరంగా అడవిలో దీనిని విడిచిపెడతామని తెలిపారు. పాము చిక్కగానే స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. -
కోళ్లను మింగిన కొండ చిలువ
గుంటూరు, తాడేపల్లిరూరల్ :వనాలు, కొండల్లో సంచరించే కొండ చిలువ ఒకటి ఉండవల్లి గ్రామంలోకి ఆదివారం తెల్లవారు జామున ప్రవేశించింది. ఓ ఇంటి వరండాలో ఉన్న నాలుగు కోళ్లనుమింగేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న మేకను మింగేందుకు ప్రయత్నించింది. అలికిడికి నిద్ర లేచిన ఇంటిలోని సభ్యులు కొండ చిలువను ఒక్కసారిగా చూసి భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువ మింగిన నాలుగు కోళ్లను వారి ఎదుట బయటకుఊసివేయడంతో భయంతో వణికిపోయారు. ధైర్యం చేసిన ఇంటి యజమానికొండ చిలువను మట్టుబెట్టాడు. అది సుమారు 10 అడుగుల పొడవు ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. -
బాబోయ్ కొండచిలువ.
భద్రాద్రి కొత్తగూడెం : బాబోయ్ కొండ చిలువ..అని భయపడి..దానిని చంపేయబోతుండగా స్నేక్ రెస్క్యూ సభ్యుడు జిమ్ సంతోష్ కాపాడి..వన్యప్రాణి సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అడవిలో వదిలేశారు. బుధవారం తెల్లవారుజామున మంచికంటినగర్‌లో బండ్ల ఉమ అనే మహిళ ఇంట్లోకి కొండచిలువ వచ్చింది. భయపడి అరవడంతో స్థానికులు దానిని చంపేద్దామంటూ కర్రలతో తలమీద కొట్టగా..9 అడుగుల పొడవుతో పైపైకి రావడంతో హడలిపోయారు. సమాచారం అందుకున్న..స్నేక్రెస్క్యూ సభ్యుడు సంతోష్ అక్కడికి చేరుకుని..దానిని బంధించి విద్యానగర్ కాలనీలో పశువైద్యులు నర్సింహారావు వద్ద చికిత్స చేయించారు. అనంతరం కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి..ఈ వర్షాకాలం సీజన్లో పాములొస్తుంటాయని..తనకు సమాచారం ఇస్తే వాటిని రక్షించి, సురక్షిత ప్రాంతంలో వదిలేస్తానని..చంపేయొద్దని విజ్ఞప్తి చేశారు. సర్పాలను ఎలా పట్టాలో కొంతసేపు అవగాహన కల్పించారు. అయితే..ఈ భారీ కొండచిలువను చేతులతో పట్టుకుని..అటూ ఇటూ పాకిస్తూ, ఆడిస్తూ ఉంటే..ఉద్యోగులు, స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా ఇలా క్లిక్‌మనిపించింది. -
ఫారెస్టు అధికారులకు కొండచిలువ అప్పగింత
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : గండేడ్ మండలం సంగాయిపల్లితండాలో సంచరిస్తున్న 10అడుగుల కొండచిలువను పాములు పట్టే లోకేశ్ సహాయంతో తండావాసులు పట్టుకొని సోమవారం ఫారెస్టు అధికారులకు అప్పగించారు. కొండ చిలువను పిల్లలమర్రి జంతు ప్రదర్శనశాలకు తరలించారు. బీజేపీ పట్టణ ప్రధానకార్యదర్శి రాజేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మోర్చాల జిల్లా ప్రధాన కార్యదర్శులు సుభాష్‌చంద్రబోస్, శివానాయక్ కొండ చిలువను ఫారెస్టు అధికారులకు అప్పగించారు. -
అమ్మో! కొండ చిలువ
పూతలపట్టు: మండలంలోని కమ్మగుట్టపల్లె పంచాయతీలో దండమిట్టలో బుధవారం ఓ పే...ద్ద కొండ చిలువ వచ్చింది. గ్రామస్తులు దానిని చూసి హడలిపోయారు. గ్రామ శివారల్లోని ముళ్ల చెట్లను తొలగించేందుకు కొంతమంది మహిళలు వెళ్లగా చెట్ల మధ్య కొండ చిలువను చూసి గ్రామంలోకి పరుగులు తీశారు. వెంటనే చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి కొండ చిలువను చంపేశారు. పంట పొలాలు ఉన్న నేపథ్యంలో కొండ చిలువ వల్ల హాని ఉంటుందని భావించి చంపేశామని వారు తెలిపారు.