
బుసలు కొడుతున్న పాము
టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లిన ఓ మహిళ నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో హడలిపోయింది.
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి జిల్లా): టీ పెట్టేందుకువంటగదిలోకి వెళ్లిన ఓ మహిళ నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో హడలిపోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చిప్ప మనోహర్ భార్య నాగమణి ఆదివారం సాయంత్రం ఇంట్లో టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లింది. బుస్‌బుస్‌మని శబ్ధం రావడంతో పరీక్షించి చూడగా వంటగది ప్లాట్‌ఫారం మీద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో హడలిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వచ్చి పామును ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు దాదాపు గంటసేపు కష్టపడాల్సి వచ్చింది.