ప్రత్కేక టీమ్ సభ్యులు పట్టుకున్న కోతులు
తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఈ కోతులు ఆహారం కోసం ఇళ్ల మీదికి వచ్చి, వీటి దాడిలో గాయపడిన వారు చాలా మంది ఉన్నారు. కోతుల బెడదను నుంచి విముక్తి చేయడానికి తుక్కుగూడ మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. ఈ కోతులను పటేందుకు మున్సిపల్ వార్షిక బడ్జెట్‌లో రూ. 5 లక్షల కేటాయించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోతులను పట్టే ప్రత్యేక టీమ్ సభ్యులకు ఈ పనులు అప్పగించారు. వీరు గత నెల 12వ తేదీ నుంచి కోతులను పట్టే కార్యక్రమం ప్రారంభించారు.
189 కోతుల పట్టివేత..
మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, సర్ధార్‌నగర్, ఇమూమ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ, దేవేందర్‌నగర్‌కాలనీలో మున్సిపల్ సిబ్బంది దాదాపుగా 500 పైగా కోతులు ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రత్యేక టీమ్ సభ్యులు నెల రోజుల నుంచి ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు 189 కోతులను పట్టుకున్నారు. కోతులను పట్టుకోవడానికి ప్రత్కేక టీమ్ సభ్యులు వివిధ ఆహార పదార్ధాలను ఎర చూపుతున్నారు. ఆహారం కోసం వచ్చిన వాటిని పడుతున్నారు. పట్టుకున్న కోతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా సురక్షితంగా బోనులో ఉంచుతూ వివిధ రకాల పండ్లు, ఇతరు వస్తువులను ఆహారంగా అందిస్తున్నారు. పట్టిన కోతులను శ్రీశైలం అటవి ప్రాంతంలో వదిళివేస్తున్నారు. ఇప్పటì కే రెండు దఫాలుగా కోతులను ఈ అటవిలో వదలివేశారు. ఒక్కో కోతికి మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక టీమ్ సభ్యులకు రూ. ఒక వేయి అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ మున్సిపాలిటీలో ప్రస్తుతం కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో కోతుల పట్టి వాటి నుంచి తమకి విముక్తి లభించేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా వార్డుల ప్రజలు కొరుతున్నారు.
మరో వారంలో పూర్తి
మున్సిపల్ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, ఇమామ్‌గూడ, శ్రీనగర్‌కాలనీలో ఇప్పటికే ఒక దఫా కోతులను ప్రత్యేక టీమ్ సభ్యులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 189 కోతులను పట్టి వాటిని శ్రీశైలం అడవిలో వదలివేశారు. మరో వారం రోజులో మున్సిపల్ వ్యాప్తంగా కోతులు పట్టే కార్యక్రమం పూర్తి అవుతుంది.– ఆర్.జ్ఞానేశ్వర్ మున్సిపల్ కమిషనర్ తుక్కుగూడ
Comments
Please login to add a commentAdd a comment