
పది అడుగుల కొండచిలువను అధికారులకు అప్పగిస్తున్న తండావాసులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : గండేడ్ మండలం సంగాయిపల్లితండాలో సంచరిస్తున్న 10అడుగుల కొండచిలువను పాములు పట్టే లోకేశ్ సహాయంతో తండావాసులు పట్టుకొని సోమవారం ఫారెస్టు అధికారులకు అప్పగించారు. కొండ చిలువను పిల్లలమర్రి జంతు ప్రదర్శనశాలకు తరలించారు. బీజేపీ పట్టణ ప్రధానకార్యదర్శి రాజేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మోర్చాల జిల్లా ప్రధాన కార్యదర్శులు సుభాష్‌చంద్రబోస్, శివానాయక్ కొండ చిలువను ఫారెస్టు అధికారులకు అప్పగించారు.