
మనుషులు ఖాళీ సమయంలో బోర్ కొడితే సినిమా చూడటం, ఆటలు ఆడటమో చేస్తారు. అలా కూడా టైంపాస్ కాకపోతే పెంపుడు జంతువులైన ఏ పిల్లితోనో, కుక్కతోనో ఆడుకుంటారు. కానీ ఓ వ్యక్తి సరదా కోసం పాముతోనే ఆటలు ఆడబోయాడు. చివరకు అతగాడి జుట్టు... పాము నోటికి చిక్కి గిలగిలా కొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సెప్టెంబర్ 19న ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షల వ్యూలు, వందల్లో కామెంట్లు వచ్చాయి. వివరాలు.. పాములను పట్టే ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొండ చిలువను చేతితో గాలిలో పట్టుకుని దాని మొహంపై ఊదుతూ దానితో ఆడుకుంటు రెచ్చగొట్టెలా ప్రవర్తిస్తున్నాడు. అతను చేసే వెధవ చేష్టలకు అది కూడా నోరు తెరిచి కోపంగా అతని మీదకు లేస్తూ చివరకు నిశ్శబ్దంగా ఉండిపోయింది. పాము సైలెంట్ కావడంతో అతను దానిని ముద్దు చేస్తూ నుదిటిపై పెట్టుకున్నాడు. దీంతో ఛాన్స్ కోసం ఎదురు చూసిన కొండచిలువ.. ఒక్కసారిగా అతగాడి తలను గట్టిగా పట్టేసింది. ఇక దానిని వదిలించుకోవడానికి ఆ వ్యక్తి నానాతంటాలు పడ్డాడు.
కాగా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘బాగైంది.. ఇతనికి ఇలా జరగాల్సిందే’, ‘నీకు ఇలా జరగడమే కరెక్ట్.. ఇప్పుడు తెలిసిందా నొప్పి ఎలాం ఉంటుందో’, అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘జంతువులకు మర్యాద ఇవ్వాలని.. ఇప్పడు ఇతగాడికి తెలిసొచ్చిందనుకుంటా’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment