ఆత్రేయపురం: గోదావరి వరద ప్రవాహంతో పాటు కొండ కోనల నుంచి భారీ సర్పాలు కొట్టుకుని వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొబ్బర్లంక వద్ద వరద గోదావరిలో చేపలు పట్టేందుకు ఓ మత్స్యకారుడు వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కుకుంది.
ఏదో ఒక పెద్ద చేప చిక్కి ఉంటుందని భావించిన మత్స్యకారుడు ఆ వలను బయటకు లాగడంతో అందులో కొండచిలువ కనిపించింది. చాలా పెద్ద పాము కావడంతో ఒకింత భయంతోనే స్థానికులు దీనిని చూసేందుకు ఎగబడ్డారు. చివరకు ఆ కొండచిలువను మత్స్యకారులు తిరిగి గోదావరిలోకే విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment