స్కూల్లో ఆహారం తిని 53 చిన్నారులకు అస్వస్థత | Children taken ill after eating at school | Sakshi
Sakshi News home page

స్కూల్లో ఆహారం తిని 53 చిన్నారులకు అస్వస్థత

Aug 15 2014 7:23 PM | Updated on Sep 2 2017 11:55 AM

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలలో భోజనం చేసిన 53 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.

సెహొర్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలలో భోజనం చేసిన 53 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని సెహొర్ జిల్లా బలాపూర్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.

శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిల్లలు స్కూలుకు వెళ్లారు. వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు భోంచేసిన కాసేపటికే అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమత్తం ఇచ్చావర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భోజనం సరఫరా చేసిన ఎన్జీవో లైసెన్స్ను రద్దు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement