స్కూల్లో ఆహారం తిని 53 చిన్నారులకు అస్వస్థత
సెహొర్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలలో భోజనం చేసిన 53 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని సెహొర్ జిల్లా బలాపూర్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిల్లలు స్కూలుకు వెళ్లారు. వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు భోంచేసిన కాసేపటికే అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమత్తం ఇచ్చావర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భోజనం సరఫరా చేసిన ఎన్జీవో లైసెన్స్‌ను రద్దు చేశారు.