రకరకాల వీడియోగేమ్స్ ఆడుతూ కంప్యూటర్లకు, స్మార్ట్‌ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయి గడపడం కూడా జబ్బేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా ప్రకటించింది. వీడియోగేమ్స్‌కు అలవాటు పడటాన్ని జబ్బుగా పరిగణించాలా, లేదా అనేది నిర్ధారించుకునేందుకు ఏకంగా పదేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం సాగించింది. ఫలితంగా డబ్ల్యూహెచ్‌ఓ వచ్చే ఏడాది విడుదల చేయనున్న వ్యాధుల జాబితాలో ‘వీడియోగేమింగ్ అడిక్షన్’ కూడా చేరనుంది.
డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన మానసిక ఆరోగ్య, మాదక ద్రవ్యాల దుర్వినియోగ విభాగం పదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరిపిన తర్వాత వీడియో గేమింగ్ అడిక్షన్‌ను కూడా ఒక మానసిక వ్యాధిగానే పరిగణించాలని నిర్ణయం తీసుకుందని డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్త వ్లాదిమిర్ పోజ్‌న్యాక్ తెలిపినట్లు ‘న్యూ సైంటిస్ట్’ పత్రిక వెల్లడించింది. మానసిక వైద్యనిపుణులు వీడియోగేమింగ్ అలవాటుపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment