వీడియో గేమ్స్‌... కొకైన్, జూదం లాంటివే! | Video games as addictive as cocaine or gambling | Sakshi
Sakshi News home page

వీడియో గేమ్స్‌... కొకైన్, జూదం లాంటివే!

Published Tue, Jun 19 2018 4:04 AM | Last Updated on Tue, Jun 19 2018 4:04 AM

Video games as addictive as cocaine or gambling - Sakshi

పారిస్‌: కొకైన్, జూదం తరహాలో ప్రజలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్‌ డిజార్డర్‌’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ శేఖర్‌ సక్సేనా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జాబితాలో భారీ మార్పులు చేర్పులు చేయడం ఇదే తొలిసారన్నారు. వీడియో గేమ్‌ వ్యసనాన్ని ఓ వ్యాధిగా గుర్తించాలని గత జనవరిలోనే నిర్ణయించినట్లు వెల్లడించారు. వీడియోగేమ్‌ను వదల్లేకపోవడం, తిండీతిప్పలు గుర్తురాకపోవడం, నిద్రపోకపోవడం దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement