Mushroom Soup Recipe: మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
Published
Fri, Dec 8 2023 4:55 PM
| Last Updated on Tue, Dec 12 2023 10:55 AM
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి
మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట;
ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క,
మిరియాల పొడి - పావుటీ స్పూన్
వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ ,
మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు
తయారీ:
ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి.