ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి జె. కృష్ణకిశోర్‌తోపాటు పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజాధనం దుర్వినియోగంలో వీరిద్దరి పాత్ర ఉందని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించింది. పరిశీలించిన ప్రభుత్వం.. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంది.