
విశాఖ సిటీ: నిన్న మొన్నటి వరకు తెలంగాణలో దాడులు నిర్వహించి దుమ్ము రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. ఇప్పుడు విశాఖలో దాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం నగరానికి భారీగా ఐటీ బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, బెంగళూరు, చెన్నై నుంచి బృందాలు నగరానికి వచ్చినట్లు సమాచారం. గురువారం భారీగా ఐటీ దాడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ ఉన్నతాధికారులు విశాఖలో మకాం వేశారని తెలుసుకున్న కొంతమంది రాజకీయ ప్రముఖుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే.. అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుసుకొని తదుపరి ప్రణాళికపై సన్నిహిత వర్గాలతో చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment