సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని మంత్రి హరీష్‌రావు ఖండించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీఘాట్లను ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీకి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పాలనను వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తోంది. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టారు. రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందన్నారు.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా?
కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని అక్కడ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటుంది. అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు అని హరీష్‌రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతో పాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అందరూ చూశారన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేస్తోందని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment