
పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు
హైదరాబాద్ : నగరంలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. పెద్ద నోట్ల మార్పిడితో పోస్టాఫీసులలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ తనిఖీల్లో నారాయణగూడ పోస్టాఫీసులో రూ.40లక్షలు పట్టుబడ్డాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 8 నుంచి పోస్టాఫీసులలో జరిగిన లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్లో భారీగా బ్లాక్మనీ డిపాజిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం పది పోస్టాఫీసుల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.